Begin typing your search above and press return to search.

గాలిపటాలే బాంబులు..పాలస్తీనా ప్రతీకారం

By:  Tupaki Desk   |   18 Jun 2018 11:40 AM GMT
గాలిపటాలే బాంబులు..పాలస్తీనా ప్రతీకారం
X
ఎన్నో ఏళ్ల నుంచి పాలస్తీన - ఇజ్రాయిల్ దేశాల మధ్య గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే.. మామూలుగా ఈ రెండు దేశాలు బాంబులతో - మిసైల్స్ తో పెద్ద పెద్ద గన్నులతో దాడులు చేసుకునేవి. కానీ ఇప్పుడు పాలస్తీనా వినూత్నంగా గాలిపటాలను ఆయుధాలుగా మార్చి రంగంలోకి దించుతోంది.

చిన్న భారీ సైజులో ఉండే గాలిపటాలను పాలస్తీనా వాసులు తయారు చేసి తోక చివర నిప్పు పెట్టి ఇజ్రాయిల్ దేశంలోకి ఎగరవేస్తున్నారు. అంతే అలా ఆ గాలిపటాలు అడవులను - ఊర్లను తగుల బెట్టుకుంటూ పోతున్నాయి. గాలి పటాల వల్ల అటవీ ప్రాంతాలు, ఊర్లు తగలబడటం వల్ల దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం గాలిపటాలనే కాదు.. మండే బెలూన్లను సైతం ఇజ్రాయిల్ దేశంలోకి వదిలి అక్కడ నిప్పురాజేసి భారీ అగ్నిప్రమాదాలను సృష్టిస్తున్నారు.

ఇప్పుడు ఇజ్రాయిల్ ప్రజలు గాలి పటాలను చూస్తే వణికిపోతున్నారు. గాల్లో ఎగిరే గాలి పటాలు ఎక్కడ కనిపించినా వాటిని చూసి దూరంగా పరిగెడుతున్నారు. నిప్పు కణికల్లా వస్తున్నా ఈ గాలిపటాలు, బెలూన్ల వల్ల విసిగిపోయిన ఇజ్రాయిల్ దీనికి ప్రతిగా పాలస్తీనా ప్రధాన నాయకుడి కారును పేల్చేసి ప్రతీకారం తీర్చుకుంది.