Begin typing your search above and press return to search.

భారత్‌, పాక్ యుద్ధ వాతావ‌ర‌ణంలో కొత్త ట్విస్ట్‌

By:  Tupaki Desk   |   30 Sep 2016 4:27 PM GMT
భారత్‌, పాక్ యుద్ధ వాతావ‌ర‌ణంలో కొత్త ట్విస్ట్‌
X
భార‌త్‌-పాకిస్తాన్ దేశాల మ‌ధ్య ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొన్న నేప‌థ్యంలో పాకిస్తాన్ మ‌రో కవ్వింపు చ‌ర్య‌కు పాల్ప‌డింది. భారత సినిమాల ప్రదర్శనను పాకిస్తాన్ నిలిపివేసింది. పాక్ ఆర్మీకి సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ సినిమా థియేటర్ల యాజమాన్యాలు ప్రకటించాయి. ఈ నిర్ణయం తీసుకున్న వాటిలో లాహోర్ లోని సూపర్ సినిమాస్ ముందు వరుసలో ఉంది. ఇది ఆ దేశంలో అతిపెద్ద సినిమా హౌజ్. తమ థియేటర్లలో ఇండియన్ సినిమాల ప్రదర్శనను నిలిపివేస్తున్నట్లు సూపర్ సినిమాస్ ఫేస్‌ బుక్ ద్వారా వెల్లడించింది. అనంతరం కరాచీలోని న్యూప్లెక్స్ సినిమాస్ కూడా ఇదే బాటలో నడిచింది. ఇండియన్ సినిమాలకు సంబంధించిన అన్ని డీవీడీల అమ్మకాన్ని సైతం నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. న్యూప్లెక్స్ - ఆట్రియమ్‌ సంస్థలు తమ థియేటర్లలో ప్రదర్శిస్తున్న బిగ్‌ బి అమితాబ్ పింక్ సినిమాను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణ నెలకొన్న నేపథ్యంలో పాకిస్తాన్‌ లోని సినిమా బిజినెస్‌ పై కోలుకోలేని దెబ్బ పడింది.

మరోవైపు పాకిస్తాన్ ఆర్టిస్టులను భార‌తీయ సిమాల్లో నటించనివ్వకుండా నిషేధించాలని మ‌హారాష్ట్ర న‌వ‌నిర్మాణ సేన పిలుపునిచ్చిన నేప‌థ్యంలో ఐఎంపీపీఏ(ఇండియన్ మోషన్ పిక్చర్స్ అసోసియేషన్) ఆ దేశ న‌టీన‌టుల‌ను బ‌హిష్క‌రించింది. దీన్ని బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ ఖాన్ ఖండిస్తూ పాక్ అర్టిస్టులకు మద్దతుగా నిలిచారు. ఆర్టిస్టులు టెర్రరిస్టులు కాదని వ్యాఖ్యానిస్తూ యురి ఘ‌న‌కు పాల్ప‌డింది ఉగ్ర‌వాదులే త‌ప్ప న‌టీన‌టులు కాద‌న్నారు. పైగా వారు న‌టించేందుకు వీసా ఇచ్చిందే భార‌త‌దేశ ప్ర‌భుత్వ‌మ‌ని గుర్తుచేశారు. మ‌రోవైపు పాకిస్తాన్ ఇండియన్ సినిమాల ప్రదర్శనను నిలిపివేస్తుంటే ఆదేశ నటులకు మనమెందుకు వేశాలివ్వాలని పలువురు బాలీవుడ్ సినిమా నిర్మాతలు అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/