Begin typing your search above and press return to search.

పదిమంది మనవాళ్ల‌ను కాపాడిన పాకిస్తానీ

By:  Tupaki Desk   |   27 March 2017 10:09 AM GMT
పదిమంది మనవాళ్ల‌ను కాపాడిన పాకిస్తానీ
X
భార‌త్‌ - పాకిస్తానీ ప్ర‌జ‌లంటే క‌య్యానికి కాలు దువ్వేందుకు సిద్ధంగా ఉంటార‌నుకునే వాళ్లు త‌మ అభిప్రాయాల‌ను మార్చు కోవాల్సిందే. ఎందుకంటే ఈ అరుదైన ఘ‌ట‌న దానికి నిద‌ర్శ‌నం కాబ‌ట్టి. త‌న కొడుకు హ‌త్య కేసులో దోషులుగా తేలిన ప‌ది మంది భారతీయుల‌కు క్ష‌మాభిక్ష పెట్టాల‌ని కోరాడు ఓ పాకిస్థానీ. యూఏఈలోని అబుదాబిలో జ‌రిగిందీ ఘ‌ట‌న‌. 2015లో బాధితుడి కొడుకును ఈ ప‌ది మంది హ‌త్య చేసిన‌ట్లు విచార‌ణ‌లో తేలింది. ఈ నేరానికిగాను కోర్టు వీరికి మ‌ర‌ణ‌శిక్ష విధించింది.

అయితే ష‌రియా (ముస్లిం చ‌ట్టం)ను పాటించే యూఏఈలాంటి దేశంలో బాధితుడి కుటుంబం దోషుల‌కు శిక్ష ప‌డ‌కుండా కోర్టులో క్ష‌మాభిక్ష పిటిష‌న్ దాఖ‌లు చేసుకొనే అవ‌కాశం ఉంటుంది. దీని ప్ర‌కార‌మే ముహ‌మ్మ‌ద్ రియాజ్‌ అనే ఆ వ్య‌క్తి ఈ ప‌ది మంది భార‌తీయుల‌ను క్ష‌మించాడు. ``దుర‌దృష్ట‌వ‌శాత్తు నా కొడుకును కోల్పోయా. ఆ ప‌ది మందిని నేను క్ష‌మించాను. నిజానికి అల్లా వారి జీవితాల‌ను కాపాడాడు`` అని రియాజ్ అన్నాడు. 2015లో జ‌రిగిన ఓ ఘ‌ర్ష‌ణ‌లో ఈ ప‌ది మంది రియాడ్ కుమారుడు ఫ‌ర్హాన్‌ ను హ‌త్య చేశారు. మ‌ర‌ణ‌శిక్ష బ‌దులుగా దోషులు.. బాధితుడి కుటుంబానికి కొంత డ‌బ్బు చెల్లించాల్సి ఉంటుంది. అర‌బ్ దేశాల్లో దోషులుగా తేలిన, అరెస్ట‌యిన వారిని కాపాడేందుకు ఏర్పాటుచేసిన త‌న చారిట‌బుల్ ట్ర‌స్ట్ నుంచి ఈ డ‌బ్బును చెల్లించ‌నున్నారు దుబాయ్‌ కు చెందిన భార‌త వ్యాపార‌వేత్త‌. ప‌రిహారంగా 2 ల‌క్ష‌ల దిర్హామ్స్ (రూ.35 ల‌క్ష‌లు)ను చెల్లించాల్సి ఉంటుంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/