Begin typing your search above and press return to search.

బాంబులేస్తూనే.. క్రికెట్ ఆడ‌మంటున్నారు

By:  Tupaki Desk   |   2 Sep 2015 1:19 PM GMT
బాంబులేస్తూనే.. క్రికెట్ ఆడ‌మంటున్నారు
X
త‌మ్ముడు త‌మ్ముడే.. పేకాట పేకాటే అన్న‌ట్లుగా ఉంది దాయాది పాకిస్తాన్ వైఖ‌రి. ఓప‌క్క స‌రిహ‌ద్దుల్లో బాంబుదాడుల‌తో అమాయ‌క పౌరుల్ని.. సైనికుల ప్రాణాల్ని తీసేస్తున్న ఆ దేశం.. మ‌రోవైపు మాత్రం త‌న‌తో క్రికెట్ ఆడ‌రా? అని ప్ర‌శ్నిస్తుంది. రాజ‌కీయం వేరు..క్రీడ‌లు వేరంటూ సూక్తులు చెబుతున్న పాక్ క్రికెట్ సంఘం.. భార‌త్ తో ఆడేందుకు తెగ ఆరాటం ప్ర‌ద‌ర్శిస్తోంది.

తీవ్ర‌మైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. షెడ్యూల్ ప్ర‌కారం డిసెంబ‌రులో భార‌త్ తో వ‌న్డే.. టెస్ట్ క్రికెట్ సిరీస్ ను ఆడాల‌ని త‌హ‌త‌హ‌లాడుతోంది. భార‌త్‌ తో మ్యాచ్ అంటే.. ప్ర‌క‌ట‌న‌లు.. టీవీ హ‌క్కుల‌తో కాసులు కుర‌వ‌టం ఖాయం. అదే జ‌రిగితే.. పాకిస్తాన్ బోర్డుకున్న ఆర్థిక క‌ష్టాలు ఈ ఒక్క సిరీస్‌ తో మాయ‌మైపోతాయి. అందుకే.. రాజ‌కీయాలు వేరు.. ఆట‌లు వేరంటూ కొత్త మాట‌ను తెర‌ పైకి తీసుకొచ్చి.. డిసెంబ‌రులో జ‌ర‌గాల్సిన షెడ్యూల్ సిరీస్ ను.. త‌ట‌స్థ వేదిక మీద ఆడాలంటోంది.

తాజాగా బీసీసీఐకి లేఖ రాసిన పాక్ క్రికెట్ బోర్డు.. ద్వైపాక్షిక సంబంధాల్ని.. ఆట‌ను వేర్వేరుగా చూడాలంటూ పాక్ బోర్డు చేస్తున్న వాద‌న‌పై బీసీసీఐ పెద్ద‌లు మాత్రం పాజిటివ్‌గా లేర‌ని చెబుతున్నారు. ఓవైపు స‌రిహ‌ద్దుల్లో త‌మ వారి ప్రాణాలు తీసుకున్న దేశంతో ఆట ఆడేదేందన్న మాట వినిపిస్తోంది. తాజాగా పాక్ బోర్డు రాసిన లేఖ‌కు బీసీసీఐ ఏ స‌మాధానం చెబుతుందో చూడాలి.