Begin typing your search above and press return to search.

నిజంగానే... పాక్ పాల‌కులు వెధ‌వ‌లే!

By:  Tupaki Desk   |   19 Nov 2017 10:27 AM GMT
నిజంగానే... పాక్ పాల‌కులు వెధ‌వ‌లే!
X
జ‌మ్మూ కాశ్మీర్‌ పై ప‌ట్టు సాధించేందుకు - మొత్తం ఆ రాష్ట్ర భూభాగాన్నే త‌న‌లో క‌లిపేసుకునేందుకు దాయాదీ దేశం పాకిస్థాన్ చేయ‌ని య‌త్న‌మంటూ లేద‌నే చెప్పాలి. అందివ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్ని ఈ దిశ‌గానే వినియోగించుకునేందుకు ఏమాత్రం జంక‌ని పాక్‌... అంత‌ర్జాతీయ వేదిక‌పైనా ఇదే అంశంపై నోరెత్తుతున్న విష‌య‌మూ మ‌న‌కు తెలియ‌నిది కాదు. అయితే కాశ్మీర్ విష‌యంలో ఎవ‌రి వాద‌న క‌రెక్టో ప్ర‌పంచ దేశాల‌కు ఏ ఒక్క‌రో చెప్పాల్సిన అవ‌స‌రం ఎంత‌మాత్రం లేద‌న్న విష‌య‌మూ తెలిసిందే. అందుకే... పాక్ ఎన్ని ప‌ర్యాయాలు కాశ్మీర్ అంశాన్ని ప్ర‌స్తావిస్తున్నా... ప్ర‌పంచంలోని ఏ ఒక్క దేశం కూడా ఆ దేశం వాద‌న‌కు మ‌ద్ద‌తు ప‌ల‌క‌డం లేదు. ఈ త‌ర‌హా భావ‌న వ్య‌క్తం కావ‌డానికి పాక్ దుర్బుద్ది ఓ కార‌ణ‌మైతే... భార‌త్ నిజాయతీతో కూడిన వ్య‌వ‌హార స‌ర‌ళి కూడా ఓ కార‌ణ‌మ‌నే చెప్పాలి. ఎందుకంటే... ఎక్క‌డ కూడా త‌న‌కు తానుగా కాశ్మీర్ అంశాన్ని ప్ర‌స్తావించ‌ని భార‌త్‌... పాక్ నోరిప్పితేనే... ఆ దేశ వాద‌న‌ను తునాతున‌క‌లు చేసేందుకు మాత్ర‌మే గ‌ళం విప్పుతోంది. ఈ త‌ర‌హా నిజాయ‌తీనే కాశ్మీర్‌ ను భారత్‌ లో అంత‌ర్భాగంగా నిలుపుతోంద‌న‌డంలోనూ ఎలాంటి సందేహం లేద‌ని చెప్పాలి.

అయినా ఇప్పుడు కాశ్మీర్ గురించి, ఆ ప్రాంతాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాల‌ని పాక్ చేస్తున్న కుతంత్రాల‌ను ఇప్పుడు ఇంత‌గా ప్ర‌స్తావించుకోవాల్సిన అవ‌స‌రం ఏముంద‌నేగా? ఇప్పుడు కాక‌పోతే... మ‌రెప్పుడూ ఈ అంశాన్ని ప్ర‌స్తావించ‌లేం. ఎందుకంటే... నిన్న‌టిదాకా అంత‌ర్జాతీయ వేదిక‌ల మీద ర‌చ్చ చేసిన పాక్‌... మ‌ళ్లీ ఆ వేదిక‌ల‌ను ఎక్కింది. అయితే సోష‌ల్ మీడియాలో ఆ దేశం చేసిన దుష్ప్ర‌చారాన్ని గ‌ట్టిగా బుద్ధి చెప్పిన సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ట్విట్ట‌ర్... ఏకంగా పాక్ డిఫెక్స్ పేరిట ఉన్న పాకిస్థాన్ ర‌క్ష‌ణ శాఖ ట్విట్ట‌ర్ ఖాతాను స‌స్పెండ్ చేసి పారేసింది. ఈ విష‌యానికి సంబంధించిన పూర్తి వివ‌రాల్లోకెళితే... ఓ భార‌తీయ పౌరురాలి చేతిలో ఓ పోస్ట‌ర్ పెట్టి, ఆ పోస్ట‌ర్‌ లో భార‌తీయ వ్య‌తిరేక వ్యాఖ్య‌ల‌ను నింపేసిన చిత్రాన్ని పాక్ డిఫెన్స్ ట్విట్ట‌ర్ ఖాతాలో ప్ర‌త్య‌క్ష‌మైన సంగ‌తి తెలిసిందే. స‌ద‌రు పోస్ట‌ర్‌ లో... తాను భార‌తీయురాలినేన‌ని, అయినా తాను భార‌త్‌ ను ద్వేషిస్తున్నాన‌ని స‌ద‌రు యువ‌తి చెబుతున్న‌ట్లుగా ఉంది. దీనిపై పెను దుమారం రేగింది.

అయితే చివ‌ర‌కు ఆ పోస్ట్ మార్ఫింగ్ పోస్ట్‌ గా తేలింది. దీంతో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ట్విట్ట‌ర్‌... పాక్ డిఫెన్స్ ఖాతాను స‌స్పెండ్ చేసింది. ఇప్పుడీ వ్య‌వ‌హారం ప్ర‌పంచ వ్యాప్తంగా పెను క‌ల‌క‌లమే రేపుతోంది. ఓ దేశానికి చెందిన ర‌క్ష‌ణ శాఖ బాధ్య‌తార‌హితంగా వ్య‌వ‌హ‌రించి ట్విట్ట‌ర్ చేతిలో మొట్టికాయ‌లు తిన్న‌ద‌న్న అర్థం వ‌చ్చేలా ప‌లువురు కామెంట్లు చేస్తున్నారు. ఈ దిశ‌గా ట్విట్ట‌ర్ పోస్ట్ చేసిన స‌స్పెన్ష‌న్ పోస్ట్‌ ను రీ ట్వీట్ చేస్తున్న వారు దానికి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్యానాల‌ను జ‌త చేస్తున్నారు. ఇందులో భాగంగా ఓ తెలుగు యువ‌కుడు దీనిపై చాలా ఆస‌క్తిక‌రంగానే కాకుండా పాక్ తీరుపై ఆగ్ర‌హం వెళ్ల‌గ‌క్కుతూ... పాక్‌ ను - ఆ దేశ పాల‌కుల‌ను ఊటంకిస్తూ సంచ‌ల‌న ట్వీట్ చేశాడు. ఆ తెలుగోడి ట్వీట్ ఎలా సాగిందంటే... *ట్విట్ట‌ర్ అకౌంట్‌ ను కాపాడుకోలేరు. కాశ్మీర్ కావాలంట వెధ‌వ‌ల‌కి!* అంటూ ఆ యువ‌కుడు పాక్ కుతంత్రంపై త‌న‌దైన శైలిలో సెటైర్ వేశాడు.