Begin typing your search above and press return to search.

భ‌ర్త చేతిలో పాక్ ప్ర‌ముఖ న‌టి హ‌త్య‌

By:  Tupaki Desk   |   9 Aug 2018 7:21 AM GMT
భ‌ర్త చేతిలో పాక్ ప్ర‌ముఖ న‌టి హ‌త్య‌
X
పాకిస్థాన్ లో సంచ‌ల‌నం చోటు చేసుకుంది. పాక్ ప్ర‌ముఖ న‌టి క‌మ్ గాయ‌ని రేష్మాపై ఆమె భ‌ర్తే కాల్పులు జ‌రిపిన వైనం సంచ‌ల‌నంగా మారింది. నౌషెరా క‌లాన్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న క‌ల‌క‌లాన్ని రేపింది. భ‌ర్త‌తో ఏర్ప‌డిన విబేధాలే ఆమె హ‌త్య‌కు కార‌ణంగా భావిస్తున్నారు.

రేష్మాను నాలుగో పెళ్లి చేసుకున్నారు ఆమె భ‌ర్త‌. అయితే.. కుటుంబంతో ఏర్ప‌డిన విబేధాల కార‌ణంగా త‌న సోద‌రుడితో క‌లిసి ఆమె వేరుగా ఉంటోంది. ఇదిలా ఉండ‌గా.. తాజాగా రేష్మా ఇంటికి వ‌చ్చిన ఆమె భ‌ర్త‌.. తుపాకీతో కాల్చి చంపి పారిపోయారు.

రేష్మా పాడిన పాట‌లు పాక్ లో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందాయి. జోబ‌ల్ గోలునా చిత్రంలో ఆమె న‌టించారు. తుపాకీతో కాల్చి చంపిన ఉదంతం సంచ‌ల‌నం సృష్టించింది. హంత‌కుడైన భ‌ర్త కోసం పోలీసులు గాలింపులు చేప‌ట్టారు.