Begin typing your search above and press return to search.

అతిపెద్ద డైనింగ్ హాల్లో 'మోడీ-ఇవాంకా'

By:  Tupaki Desk   |   22 Nov 2017 9:05 AM GMT
అతిపెద్ద డైనింగ్ హాల్లో మోడీ-ఇవాంకా
X
ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు అంర‌గంగ వైభ‌వంగా జ‌ర‌గ‌నున్న గ్లోబ‌ల్ ఎంట‌ర్‌ప్రెన్యూర్ స‌మ్మిట్... త‌న‌కు వేదిక కానున్న భాగ్య న‌గ‌రి హైద‌రాబాదుకు ఓ ప్ర‌త్యేక గిఫ్ట్ ను ఇవ్వ‌బోతోంది. ఈ గిఫ్ట్‌ను బ‌య‌టి దేశాల నుంచి కొనుక్కొచ్చిన‌ది అనుకుంటే మీరు త‌ప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ప్రాచీన క‌ట్ట‌డాల‌కు, హెరిటేజ్ సంప‌ద‌కు పెట్ట‌ని కోట‌గా నిలిచిన హైద‌రాబాదుకు వేరే ఎవ‌రో, ఎక్క‌డి నుంచో... ఏదో తెస్తేనే ప్ర‌త్యేకం అయ్యే ప‌రిస్థితి లేదు. ఎందుకంటే వార‌స‌త్వ సంప‌ద కింద హైద‌రాబాదులో ఇప్ప‌టికే చాలా చిహ్నాలు ఉన్నాయి. వాటిని ప‌రిర‌క్షించుకోవ‌డంలోనూ మ‌న ప్ర‌భుత్వాలు ఏమాత్రం వెన‌కంజ వేయ‌డం లేదు. ఈ క్ర‌మంలో కొత్త‌ది - పెద్ద‌ది - అరుదైనది... అంటూ హైద‌రాబాదుకు మ‌నం కొత్త‌గా దేనినీ ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం ఎంత‌మాత్రం లేద‌నే చెప్పాలి.

అయితే మరి ఇప్పుడు హైద‌రాబాదు గురించి ప్ర‌త్యేకించి చెప్పుకోవాల్సిన విష‌యం ఏమిటంటే... ఇప్ప‌టిదాకా ఎన్నో ప్ర‌త్యేక‌త‌ల‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన మ‌న భాగ్య‌న‌గ‌రి... ఇప్పుడు స‌రికొత్త‌గా మ‌రో అదురైన రికార్డును త‌న పేరిట లిఖించుకునే అవ‌కాశాలు మెండుగా క‌నిపిస్తున్నాయి. ఈ నెల 28న ప్రారంభ‌మ‌య్యే గ్లోబ‌ల్ ఎంట‌ర్‌ప్రెన్యూర్ స‌మ్మిట్ కు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా హాజ‌రవుతున్నారు. భార‌త్‌, అమెరికాలు సంయుక్తంగా హైద‌రాబాదులో మూడు రోజుల పాటు నిర్వ‌హిస్తున్న ఈ స‌ద‌స్సుకు అమెరికా నుంచి హాజ‌రయ్యే ప్ర‌తినిధి బృందానికి ఇవాంకే నేతృత్వం వ‌హిస్తున్నారు కూడానూ. అంటే త‌మ దేశానికి చెందిన ప్ర‌తినిధి బృందాన్ని వెంటబెట్టుకుని మ‌రీ ఇవాంకా బ‌రిలోకి దిగుతున్నారన్న‌మాట‌. ఈ స‌మ్మిట్ ప్రారంభం సంద‌ర్భంగా హైద‌రాబాదులో వార‌స‌త్త సంప‌ద‌గా మంచి పేరున్న ఫ‌ల‌క్ నూమా ప్యాలెస్‌లో అతిథులంద‌రికీ ప్ర‌త్యేకంగా విందు ఇవ్వ‌నున్నారు. స‌మ్మిట్ కు వ‌చ్చిన ఆయా దేశాల ప్ర‌తినిధుల‌తో పాటు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, తెలంగాణ సీఎం క‌ల్వకుంట్ల చంద్రశేఖ‌ర‌రావు, కేంద్ర మంత్రులు, తెలంగాణ మంత్రులు, అధికారులు పెద్ద సంఖ్య‌లో హాజ‌రు కానున్నారు.

వీరందరికీ సదస్సు ప్రారంభోత్సవం సందర్భం గా తెలంగాణ సర్కారు భారీ విందును ఇస్తోందట. ఈ విందుకు ఫలక్ నూమా ప్యాలెస్ అయితే బాగుంటుందని భావించిన కేసీఆర్ సర్కారు... అక్కడ ఏర్పాట్లను కూడా ముమ్మరం చేసేందనే చెప్పాలి. అయినా ఇందులో ఏం ప్రత్యేకత ఉందంటారా? ఎందుకు లేదండీ బాబూ... ఈ విందుకు హాజరైన అతిథులకు విందారగించేందుకు ఏకంగా ఓ పెద్ద డైనింగ్ హాల్ నే తీర్చిదిద్దారట. ఈ హాలు... ప్రపంచంలోని అన్ని డైనింగ్ హాళ్ల కంటే కూడా పెద్దగా ఉందట. అంటే... గ్లోబల్ సమ్మిట్ పుణ్యమా అని భాగ్యనగరి సిగలో మరో కలికితురాయి చేరనుందన్నమాట. ఓ పక్క ప్రపంచంలోనే అతి పెద్దదైన డైనింగ్ హాల్... దానికి ఇరువైపులా వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు, అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడి ముద్దుల తనయ ఇవాంకా, భారత ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంకెంతగా మెరిసిపోతారో చూడాలి.