Begin typing your search above and press return to search.

మ‌రోసారి మోడీ దెబ్బ‌కు సెక్యూరిటీకి చెమ‌ట‌లు

By:  Tupaki Desk   |   26 May 2017 9:54 AM GMT
మ‌రోసారి మోడీ దెబ్బ‌కు సెక్యూరిటీకి చెమ‌ట‌లు
X
మోడీ కాస్త భిన్న‌మైన నేత‌. ఆ విష‌యంలో ఎవరికి ఎలాంటి సందేహాల్లేవు. ఈ ఫ‌క్తు రాజ‌కీయ నేత‌లో విల‌క్ష‌ణ‌మైన కోణం ఏమిటంటే.. త‌న‌ను తాను మేనేజ్‌మెంట్ గురుగా మార్చేసుకునే ఆయ‌న‌.. కొన్నిసంద‌ర్భాల్లో మాత్రం భావోద్వేగాలున్న వ్య‌క్తిగా క‌నిపిస్తారు. స‌మ‌కాలీన రాజ‌కీయాల్లో ఈ త‌ర‌హా ప్ర‌ధానిని చూడ‌లేద‌నే చెప్పాలి. ప్ర‌ధానిగా ఆయ‌న‌కు ఉండే భ‌ద్ర‌త వ్య‌వ‌స్థ‌ల్ని ప‌క్క‌న పెట్టేస్తారు. ఒంట‌రిగా.. త‌న‌కు తానుగా అస్వాదించ‌టం క‌నిపిస్తుంది. ప్ర‌ధాని స్థానంలో ఉన్న వ్య‌క్తి కొన్నింటి మ‌ధ్య బంధీలుగా క‌నిపిస్తుంటారు. కానీ.. మోడీ మాత్రం వాటిని ప‌క్క‌న పెట్టేస్తుంటారు. అందుకోసం కొన్నిసార్లు రిస్క్ తీసుకోవ‌టానికి అస్స‌లు వెనుకాడ‌రు.

మోడీ లాంటి ప్ర‌ధానికి సెక్యురిటీ ప‌రంగా ఎన్ని ప‌రిమితులు ఉంటాయో తెలియంది కాదు. కానీ.. కొన్నిసంద‌ర్భాల్లో అలాంటి వాటిని ప‌క్క‌న పెట్టేస్తారు. స్వేచ్ఛ‌గా విహ‌రిస్తారు. ఈ సంద‌ర్భాల్ని ఆయ‌న చాలా బాగా ఎంజాయ్ చేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. అయితే.. మోడీ సంగ‌తిని పక్క‌న పెడితే.. ఆయ‌న‌కు సెక్యూరిటీగా ఉండే సిబ్బందికి మాత్రం ప్ర‌ధాని తీరు చెమ‌ట‌లు ప‌ట్టిస్తుంటాయి. తాజాగా మ‌రోసారి త‌న‌దైన శైలిలో వ్య‌వ‌హ‌రించిన మోడీ భ‌ద్ర‌తా సిబ్బందికి షాకిచ్చార‌నే చెప్పాలి.

దేశంలోనే అత్యంత పొడ‌వైన వంతెన‌గా ప్ర‌సిద్ధి చెందిన అసోంలోని ధోలా న‌దియా వార‌ధిని ఈ రోజు (శుక్ర‌వారం) జాతికి అంకితం శారు ప్ర‌ధాని. ఈ భారీ వంతెన పొడ‌వు ఎంతో తెలుసా? అక్ష‌రాల 9.15 కిలోమీట‌ర్లు. దాదాపు 2వేల కోట్ల‌కు పైనే వ్య‌యంతో నిర్మించిన ఈ వంతెన కార‌ణంగా జ‌రిగే ప్ర‌యోజ‌నం ఏమిటంటే.. భార‌త్ - చైనా స‌రిహ‌ద్దుల్లోకి సైనిక సామాగ్రిని వేగంగా త‌ర‌లించే వీలుంది.

ఈ వంతెన పుణ్య‌మా అని.. అసోం.. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ మ‌ధ్య దూరం ఎంత త‌గ్గిందో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. మామూలుగా అయితే.. అసోం.. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ మ‌ధ్య ఆరు గంట‌ల స‌మ‌యం ప‌ట్టేది. ఈ వంతెన పుణ్య‌మా అని అది కాస్తా గంట‌కు త‌గ్గిపోయింది. అంటే.. ఐదు గంట‌ల స‌మ‌యాన్ని ఈ వంతెన ఆదా చేయ‌నుంది. అంతేనా.. ఈ వంతెన కార‌ణంగా కోట్లాది రూపాయిల చ‌మురు బిల్లు ఆదా కానుంది.

అసోం.. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రాల్ని క‌లుపుతూ బ్ర‌హ్మ‌పుత్ర న‌దికి ఉప న‌ది అయిన లోహిత న‌దిపై ఈ వంతెనను నిర్మించారు. దీన్ని నిర్మించాల‌న్న‌ది నాలుగు ద‌శాబ్దాల క‌ల‌. అది నేటికి నిజ‌మైంది. ప్ర‌ధాని మోడీ ప్ర‌మాణ‌స్వీకారం చేసిన రోజునే ఈ భారీ వంతెన‌ను జాతికి అంకితం చేయ‌టం ఒక విశేషంగా చెప్పాలి.

ఈ వంతెన ప్రారంభోత్స‌వం సంద‌ర్భ‌గా ఒక ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. వంతెన‌ను ప్రారంభించిన అనంత‌రం.. ప్ర‌ధాని మోడీ త‌న భ‌ద్ర‌త‌ను ప‌క్క‌న పెట్టేసి.. ప్రోటోకాల్‌ కు భిన్నంగా ఒక్క‌రే వంతెన మీద న‌డుచుకుంటూ కాసింత దూరం అటూ ఇటూ న‌డిచారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌కృతి అందాల్ని అస్వాదించ‌టంతో పాటు.. ఈ వంతెన కార‌ణంగా ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌న్న విష‌యాన్ని నిశితంగా ప‌రిశీలించిన‌ట్లుగా క‌నిపించింది. అనంత‌రం అసోం ముఖ్య‌మంత్రి సోనోపాల్‌.. కేంద్ర‌మంత్రుల్ని పిలిచి ఆయ‌న మాట్లాడారు.

మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఈ భారీ వంతెన‌లో తెలుగోడి ముద్ర ఉండ‌టం. ఎందుకంటే.. ఈ భారీ వంతెన‌ను నిర్మించింది తెలుగు ప్రాంతానికి చెందిన న‌వ‌యుగ ఇంజ‌నీరింగ్ కంపెనీ లిమిటెడ్‌. హైద‌రాబాద్‌.. వైజాగ్ లు ప్ర‌ధాన కేంద్రాలుగా ప‌ని చేసే ఈ సంస్థ ఈ భారీ వంతెన‌ను నిర్మించింది. ప్ర‌భుత్వ ప్రైవేటు భాగ‌స్వామ్యం విధానంలో నిర్మించిన ఈ వంతెన‌ను క‌ట్ట‌టానికి ఆరేళ్ల స‌మ‌యం ప‌ట్టింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/