Begin typing your search above and press return to search.

నా తండ్రి రాజీనామాకు పీవీనే కార‌ణం!

By:  Tupaki Desk   |   17 Sep 2018 8:59 AM GMT
నా తండ్రి రాజీనామాకు పీవీనే కార‌ణం!
X
90వ ద‌శ‌కంలో ఇస్రో శాస్త్ర‌వేత్త‌ల గూఢ‌చ‌ర్యం - దేశ‌ద్రోహం ఆరోప‌ణ‌ల కేసు అప్ప‌ట్లో సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. ఆ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న‌ ప్ర‌ముఖ శాస్త్ర‌వేత్త నంబి నారాయ‌ణ్...ఆ త‌ర్వాత నిర్దోషిగా బ‌య‌ట‌ప‌డ్డారు. ఈ క్ర‌మంలో అకార‌ణంగా నంబి నారాయ‌ణ్ ను అరెస్టు చేసినందుకు ఆయ‌న‌కు రూ.50ల‌క్ష‌లు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌ని సుప్రీం కోర్టు...సెప్టెంబ‌రు 14న తీర్పు నిచ్చింది. అయితే, ఆ కేసులో కాంగ్రెస్ దివంగ‌త నేత‌ - కేర‌ళ మాజీ సీఎం కే క‌రుణాక‌ర‌న్ పేరు కూడా వినిపించింది. ఆయ‌న పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో అప్ప‌టి ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు ..కరుణాక‌ర‌న్ చేత రాజీనామా చేయించారు. ఈ క్రమంలో తాజాగా, నాటి ఘ‌ట‌నపై క‌రుణాక‌ర‌న్ కుమారుడు కే. ముర‌ళీధ‌ర‌న్ స్పందించారు.

త‌న తండ్రి రాజీనామాకు పీవీనే కార‌ణ‌మ‌ని - ఆయ‌న ఒత్తిడితోనే అమాయ‌కుడైన త‌న తండ్రి రాజీనామా చేయాల్సి వ‌చ్చింద‌ని అన్నారు. ఆ స‌మ‌యంలో నెహ్రూ - గాంధీ కుటుంబాల నుంచి ఎవ‌ర‌న్నా ప్ర‌ధానిగా ఉండి ఉంటే త‌న తండ్రికి రాజీనామా చేయాల్సిన అవ‌స‌రం వ‌చ్చేది కాద‌న్నారు. ఆ కేసులో ఇన్ వాల్వ్ అయిన ముగ్గురు పోలీసు అధికారుల పాత్రపై సుప్రీం కోర్టు నియ‌మించిన త్రిస‌భ్య క‌మిటీముందు హాజ‌రై తాను ఈ విష‌యాలు చెప్పేందుకు కూడా సిద్ధ‌మ‌ని అన్నారు. మ‌రోవైపు, 5 గురు కాంగ్రెస్ నేత‌లు...ఈ కేసును సృష్టించార‌ని, ముర‌ళీధ‌ర‌న్ సోద‌రి ప‌ద్మ‌జా వేణుగోపాల్ చేసిన వ్యాఖ్య‌ల‌పై కూడా ఆయ‌న స్పందించారు. వేటి ఆధారంగా ఆమె ఆ వ్యాఖ్య‌లు చేసిందో త‌న‌కు తెలియ‌ద‌న్నారు.