Begin typing your search above and press return to search.

పేటీఎం బ్యాంక్‌...ఏపీలో అడ్డుకుంటార‌ట‌

By:  Tupaki Desk   |   20 Jan 2017 7:04 AM GMT
పేటీఎం బ్యాంక్‌...ఏపీలో అడ్డుకుంటార‌ట‌
X
ఏపీలోని ప్రతి గ్రామంలో పేటీఎం సేవ‌లు - బ్యాంకు ఉండేలా చూడటం తమ లక్ష్యాంగా పేటీఎం సీఈఓ - వ్య‌వ‌స్థాప‌కుడు విజయ శేఖర్‌ శర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దావోస్‌ లో చెప్ప‌డం ర‌చ్చ ర‌చ్చ‌గా మారుతోంది. పేటీఎం బ్యాంకు ఏర్పాటును అడ్డుకుంటామ‌ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు హెచ్చ‌రించారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప్ర‌క‌టించిన పెద్ద నోట్ల రద్దు - డిజిటల్‌ లావాదేవీలకు - చంద్రబాబు లాంటి వారి మద్దతు డిజిటల్‌ కంపెనీలకు వరంగా మారిందని విమర్శించారు. పేటిఎంకు చంద్రబాబు లొంగుబాటును అంతా ఖండించాలన్నారు.

పేటీఎంకు లక్షల కోట్ల రూపాయలు లాభాలు కళ్లెదుట క‌నిపించింది విజయగర్వం - అహంకారంతో పేటిఎం సిఇవో విజయ శంకర్‌ శర్మ.. తమదారికి అడ్డొస్తే యుద్ధ ట్యాంకుల్లా తొక్కేస్తామని పేటిఎం ఉద్యోగులకు ఇచ్చిన విందులో చిందులేయడం ఆశ్చ‌ర్యంగా ఉంద‌ని మ‌ధు వ్యాఖ్యానించారు. అటువంటి అహంకారిని ఆంధ్రప్రదేశ్‌ లో గ్రామ గ్రామాన పేటీఎం బ్యాంకులు - డిజిటల్‌ యూనివర్సిటీ పెట్టమని చంద్రబాబు కోరడాన్ని తమ పార్టీ ఖండిస్తున్నట్లు తెలిపారు. దేశ విదేశీ కార్పొరేట్‌ శక్తులతో కుమ్మక్కైన మోడీ - మన దేశ సంపదను దేశ విదేశీ కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్టి దేశ ద్రోహానికి తలపడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పేటీఎం బ్యాంక్‌ పెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించొద్దని డిమాండ్‌ చేశారు. పేటిఎం దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు. ప్రజలను దోచుకునే ఈ దుష్ట శక్తులకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ప్రజలంతా కలిసి రావాలని మ‌ధు విజ్ఞప్తి చేశారు.

ఇదిలాఉండ‌గా...పేటీఎం ఫౌండర్‌ విజయ శేఖర్‌ శర్మతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దావోస్‌ లో భేటీ అయ్యారు. పేటీఎంలో తెచ్చే కొత్త సాంకేతిక పద్ధతుల్ని ముందు ఆంధ్రప్రదేశ్‌ లోనే చేపడతామని శర్మ తెలిపారు. 2020 నాటికి 500 మిలియన్‌ ఖాతాలను సమకూర్చుకోవడం త‌మ ల‌క్ష్య‌మ‌ని తెఇల‌పారు. ఈ సందర్భంగా సీఎం చంద్ర‌బాబు మాట్లాడుతూ ప‌బ్లిక్ ప్రైవేట్ ప‌ద్ధతిలో డిజిటల్‌ యూనివర్సిటీ స్థాపనకు ముందుకొస్తే తమ ప్రభుత్వం సహకరిస్తుందని ఆయనకు హమీ ఇచ్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/