Begin typing your search above and press return to search.

షాక్ః 210 వెబ్ సైట్ల‌లో ఆధార్ డేటా

By:  Tupaki Desk   |   19 Nov 2017 4:27 PM GMT
షాక్ః 210 వెబ్ సైట్ల‌లో ఆధార్ డేటా
X
ప్ర‌భుత్వ కార్యాక‌లాపాల‌కు తప్పనిసరిగా మారిన ఆధార్ విష‌యంలో సంచ‌లన వార్త తెర‌మీద‌కు వ‌చ్చింది. ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌భుత్వం వ‌ద్ద మాత్ర‌మే మ‌న ర‌హ‌స్య డాటా ఉంద‌నే మ‌న న‌మ్మ‌కం వ‌మ్ము చేసేలా...ఇంకా చెప్పాలంటే...మ‌న డేటా అంద‌రికీ చేరువ అయ్యేలా ప‌లు సంస్థ‌ల‌కు చేరింది. ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 210 వెబ్‌ సైట్ల‌లో మ‌నంద‌రి స‌మ‌స్త‌ స‌మాచారం ఉంది. ఇది ఏదో అంచ‌నానో కాదు...స్వ‌యంగా కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చిన అధికారిక వివ‌ర‌ణ‌.

ఆధార్ రూపంలో మ‌న స‌మ‌స్త వివ‌రాల‌ను సేక‌రించ‌డంపై ఇప్ప‌టికే భిన్నాభిప్రాయాలు ఉండ‌టం, కొంద‌రు కోర్టును ఆశ్ర‌యించ‌డం..భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ రూపంలో ఆధార్ త‌ప్ప‌నిస‌రేం కాద‌ని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ఆదేశం ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా స‌మాచార హ‌క్కు చ‌ట్టం ద్వారా ఓ వ్య‌క్తి ఆధార్ స‌మాచారం కేవ‌లం యూఐడీఏఐ వ‌ద్దే ఉందా లేదా మ‌రెవ‌రికయినా ఇస్తున్నారా అనే విష‌యాన్ని ప్ర‌శ్నించ‌గా ఈ వివ‌రాలు వెలుగులోకి వ‌చ్చాయి. 210 వెబ్‌సైట్లు ఆధార్ డాటాను వాడుకుంటున్నాయ‌ని, ఇందులో కేంద్ర - రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు చెందిన వాటిటో పాటుగా ప‌లు విద్యాసంస్థ‌లు సైతం ఉన్నాయ‌ని వివ‌రించారు. ఆధార్ కార్డ్ నంబ‌ర్ ఇవ్వ‌గానే వినియోగ‌దారుల వివ‌రాలు వ‌చ్చే స‌మాచారాన్ని తాము ఆయా సంస్థ‌ల‌తో పంచుకున్నామ‌ని కేంద్రం వివ‌రించింది. అయితే ప్ర‌జ‌ల భ‌ద్ర‌త‌కు న‌ష్టం చేకూర్చ‌ని విధంగా త‌గు చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని వెల్ల‌డించింది.

ప్ర‌జ‌ల‌కు సంబంధించి స‌మాచారాన్ని తాము పూర్తిగా ప‌ర్య‌వేక్షిస్తున్నామ‌ని కేంద్రం తెలిపింది. క్ర‌మం త‌ప్ప‌కుండా ఆడిట్ల‌ను నిర్వ‌హిస్తున్నామ‌ని, వినియోగ‌దారుల‌కు సంబంధించిన డేటాను సుర‌క్షితంగా ఉంచుతున్నామ‌ని పేర్కొంది. అయితే... కేంద్రం లౌక్యంగా స‌మాధానం ఇచ్చింద‌ని ప‌లువర్గాలు పేర్కొంటున్నాయి. ప‌లు టెలికాం సంస్త‌ల వ‌ద్ద ఇప్ప‌టికే ఆధార్ డేటా ఉంద‌ని పేర్కొంటూ ఈ విష‌యాన్ని త‌మ స‌మాధానంలో వివ‌రించ‌లేద‌ని గుర్తు చేస్తున్నారు. ఆధార్ విష‌యంలో త‌ప్ప‌నిస‌రి ఒత్తిడి చేస్తున్న కేంద్రం... ఆ స‌మాచారం భ‌ద్ర‌ప‌ర్చ‌డంలో త‌గు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని పెద‌వి విరుస్తున్నారు.