Begin typing your search above and press return to search.

ఆ రాత్రి ఏం జ‌రిగిందో లాడెన్ వైఫ్ చెప్పింది

By:  Tupaki Desk   |   30 May 2017 4:40 AM GMT
ఆ రాత్రి ఏం జ‌రిగిందో లాడెన్ వైఫ్ చెప్పింది
X
వేలాది మంది త‌మ వాళ్ల చావుకు కార‌ణ‌మైన అల్ ఖైదా తీవ్ర‌వాది ఒసామా బిన్ లాడెన్ ను వేటాడి.. వెంటాడి మ‌రీ ఏసేసిన అమెరికాకు.. ఆ దేశ ప్ర‌జ‌లు 2011.. మే ఒక‌టో తేదీని అస్స‌లు మ‌ర్చిపోరు. సీక్రెట్ ఆప‌రేష‌న్ ద్వారా లాడెన్ ను మట్టుబెట్టిన తీరు ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. ట్విన్ ట‌వ‌ర్స్ ను విమానాల‌తో ఢీ కొట్టించి అమెరిక‌న్ల‌కు ప్రాణ‌ భ‌యం అంటే ఎలా ఉంటుందో ప‌రిచ‌యం చేసి.. కొన్నేళ్ల పాటు వారిలో న‌మ్మ‌కాన్ని చంపేసిన లాడెన్ ను అమెరికా భారీ ప్లాన్ తో మ‌ట్టు బెట్ట‌టం తెలిసిందే.

లాడెన్ ను ఏసేసిన రోజు రాత్రి ఏం జ‌రిగింద‌న్న దానిపై ఇప్ప‌టివ‌ర‌కూ అమెరికా వాద‌న‌ను.. ఈ ర‌హ‌స్య ఆప‌రేష‌న్లో ప‌ని చేసిన వారి మాట‌ల్నే విన్నాం. కానీ.. బాధితుల త‌ర‌ఫు నుంచి ఒక్క‌రు కూడా త‌మ వాద‌న‌ను వినిపించింది లేదు. ఆ రోజు రాత్రేం జ‌రిగింద‌న్న విష‌యాన్ని వెల్ల‌డించింది లేదు. తాజాగా ఆ లోటును తీరుస్తూ.. లాడెన్ నాలుగో భార్య అమ‌ల్ అస‌లేం జ‌రిగిందో చెప్పుకొచ్చారు. లాడెన్ చ‌నిపోవ‌టానికి ముందు అస‌లేం జ‌రిగింద‌న్న విష‌యాన్ని ది ఎక్సైల్‌: ది ఫైట్ ఆఫ్ ఒసామా బిన్ లాడెన్ పేరిట కాతీ స్కాట్ - క్లార్క్‌.. అడ్రియాన్ లెవీలు ఒక పుస్త‌కం రాస్తున్నారు. వారికి లాడెన్ నాలుగో స‌తీమ‌ణి ప‌లు విష‌యాలు వెల్ల‌డించింది. ఆ వివ‌రాలు పాశ్చాత్య మీడియాలో బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఆ వివ‌రాల్లోకి వెళితే..

‘ఆ రోజు రాత్రి అమెరికా మిలిటరీకి చెందిన బ్లాక్‌ హాక్‌ హెలికాప్టర్‌ అబోటాబాద్‌లోని మా ఇంటి కాంపౌండ్‌లోకి దిగింది. అప్పటికే మేం ఆ ఇంట్లో ఆరేళ్లుగా తలదాచుకుంటున్నాం. హెలికాప్టర్‌ శబ్దం విని మేల్కొన్న నా భర్త(లాడెన్‌) ముఖంలో చాలా భయం చూశాను. అమెరికన్‌ సీల్స్‌ ఇంటి లోపలికి ప్రవేశిస్తుండగా మా సోద‌రీమ‌ణులు (లాడెన్‌ ముగ్గురు భార్యలు) (అమల్‌ లాడెన్‌ నాలుగో భార్య) వారి పిల్లలను తీసుకొని ఆయన ఉన్న అప్‌స్టెయిర్స్‌కు వెళ్లి ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు. అయితే, వారిని అక్కడ ఉండొద్దని, అందరినీ కిందికి వెళ్లిపోవాలని లాడెన్‌ చెప్పారు. వారికి కావాల్సింది నేను.. మీరు కాదు ఇక్కడి నుంచి వెళ్లిపోండన్నారు. మిగిలిన‌ వారు వెళ్లిపోగా నేను మాత్రం ఆయన పక్కన నా కొడుకు హుస్సేన్‌తో కలిసి ఉండేందుకు నిర్ణయించుకున్నాను. అమెరికా సైనికులు లోపలికి వస్తూ లాడెన్‌ కుమారుల్లో ఒకరైన ఖలీద్‌ను చంపేస్తూ పిల్లలతో గొడవ పడుతూ పైకి వస్తున్నారు. సరిగ్గా మేం ఉన్న గదికి రాగానే నేను వారిని తోసివేసేందుకు ప్రయత్నించాను. కానీ, వారు ఫైరింగ్‌ స్టార్ట్‌ చేయగా నా కాలికి బుల్లెట్ తగిలి పక్క గదిలో పడిపోయాను. ఆ తర్వాత‌ ఓపిక చేసుకొని తిరిగొచ్చి చూసేసరికి అప్పటికే లాడెన్‌ చనిపోయి ఉన్నాడు. ఆ దృశ్యాన్ని నేను నా కొడుకు హుస్సేన్‌ చూశాం. అది చూసి నేను నిశ్చేష్టురాలినయ్యాను’ అని చెప్పిన‌ట్లుగా స‌ద‌రు క‌థ‌నం పేర్కొంది.

త‌మ‌కు తెలిసిన వారే త‌మ స‌మాచారాన్ని బ‌య‌ట‌కు వెల్ల‌డించి ఉంటార‌ని.. తాము ఉన్న ఇల్లే లాడెన్ మ‌ర‌ణానికి నిల‌యంగా మారుతుంద‌ని తాను అస్స‌లు అనుకోలేద‌ని చెప్పిన‌ట్లుగా పేర్కొన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/