Begin typing your search above and press return to search.

మోడీతో రాహుల్ టీం కశ్మీర్ ఫైట్..ఏం జరగబోతోంది?

By:  Tupaki Desk   |   24 Aug 2019 7:36 AM GMT
మోడీతో రాహుల్ టీం కశ్మీర్ ఫైట్..ఏం జరగబోతోంది?
X
వేల మంది సైన్యాన్ని కశ్మీర్ లో దించి అష్టదిగ్బంధనం చేసి కశ్మీర్ ను విభజించి ఆర్టికల్ 370ను రద్దు చేసేశారు మోడీ. దేశవ్యాప్తంగా ఈ చర్యతో మోడీ హీరో అయిపోయాడు. ప్రశంసలు అందుకున్నాడు. అయితే కశ్మీరీలు ఈ నిర్ణయంపై ఏమనుకుంటున్నారు. వారి మనోభావాలు ఏంటి అనేది మాత్రం వెల్లడి కాలేదు. ఎందుకంటే అక్కడ ఫోన్ - ఇంటర్నెట్ - మీడియాను నిషేధించారు. దీంతో కశ్మీరీల వాయిస్ వినిపించలేదు..

ఇప్పుడు ఇదే అస్త్రంగా మోడీని ఇరుకునపెట్టేందుకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెడీ అయ్యారు. రాహుల్ తోపాటు కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ - సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ - సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా - ఆర్డేడీ నుంచి మనోజ్ జా - డీఎంకే - తృణమూల్ కాంగ్రెస్ నేతలతో టీం కశ్మీర్ వెళ్లడానికి శుక్రవారం రాత్రి సమావేశమై నిర్ణయానికి వచ్చారు.

ఆర్టికల్ 370 రద్దు - కశ్మీర్ విభజన తర్వాత కశ్మీర్ ప్రజలు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారనే విషయంపై స్వయంగా అక్కడి ప్రజలను అడిగి తెలుసుకోవడానికి రాహుల్ టీం రెడీ అయ్యింది. ప్రభుత్వం అనుమతిస్తే శ్రీనగర్ - కశ్మీర్ లోయలో కూడా పర్యటించి కశ్మీరీల వాయిస్ దేశానికి,ప్రపంచానికి వినిపించేందుకు రెడీ అయ్యారు.

అయితే ఇక్కడే ట్విస్ట్ ఉంది. కశ్మీర్ ను గుప్పిట పట్టిన మోడీజీ ఈ రాహుల్ టీంకు అనుమతిస్తారా? దేశ సార్వభౌమత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వెళుతున్న ప్రతిపక్షాలను అక్కడికి వెళ్లనిస్తారా అన్నదే ప్రశ్న. కశ్మీరీల అభిప్రాయం తెలుసుకోవడం మంచి నిర్ణయమే అయినా అది నెగెటివ్ గా వస్తే మాత్రం మోడీ ఇరుకునపడడం ఖాయం. దేశానికే అప్రతిష్ట. మరీ రాహుల్ టీం అన్నంత పనిచేస్తుందా ? మోడీ చేయానిస్తాడా అన్నది వేచిచూడాలి.