Begin typing your search above and press return to search.

ఓటుకు నోటుకు ఏడాదిః కేసీఆర్ సంచ‌ల‌న టేపులు

By:  Tupaki Desk   |   29 May 2016 5:30 PM GMT
ఓటుకు నోటుకు ఏడాదిః కేసీఆర్ సంచ‌ల‌న టేపులు
X
తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన ఓటుకు నోటుకు నేటితో ఏడాది పూర్తయింది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓటు కోసం టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి రెడ్‌ హ్యాండెడ్‌ గా దొరికిపోయిన ఉదంతం క‌ల‌క‌ల రేపింది. ఈ సంద‌ర్భంగానే ఏపీ సీఎం చంద్ర‌బాబు మాట్లాడిన‌ట్లు ఆడియో టేపులు విడుద‌ల‌వ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగింది. రాజ‌కీయ నాయ‌కుల‌ను ఆయా సంఘ‌ట‌న‌లు ఇర‌కాటంలో ఎలా ప‌డేస్తాయో ఈ ఉదంత‌ తెలియజెప్పింది. అయితే తాజాగా టీఆర్ ఎస్‌ లో ఆడియో టేపుల వ్య‌వ‌హ‌రం క‌ల‌క‌లం సృష్టిస్తోంది.

టీఆర్ ఎస్ పార్టీలో కొంత మంది ఎమ్మెల్యేలు - పార్టీ ముఖ్యుల పనితీరు అధిష్టానానికి తలనొప్పులు తెచ్చిపెడుతోంది. కొంత మంది ఎమ్మెల్యేలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని సొంత దందాలు మొదలు పెట్టినట్లు జోరుగా పార్టీలో ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు కొద్ది రోజులుగా బెదిరింపులకు పాల్పతున్నట్లుగా వరుసగా ఆడియో టేపులు బహిర్గతం అవుతుండటంతో అధిష్టానం తలలు పట్టుకుంటుంది. రంగారెడ్డి - మహబూబ్ నగర్ - నల్లగొండ జిల్లాల్లో మొదటి సారి గెలిచిన ఎమ్మెల్యేలు బెదిరింపులకు పాల్పడున్నట్లు ఉన్న పోన్ రికార్డులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. కరీంనగర్ - వరంగల్ జిల్లాల్లోను ఇద్దరు ఎమ్మెల్యేలపై వరుసగా అరోపణలు వినిపిస్తున్నాయి. అదిలాబాద్‌ లో మరో ఎమ్మెల్యే అధికారులను బెదిరించినట్లు వార్తలు వచ్చాయి.

గత కొంత కాలంగా మంత్రులపైనా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దగ్గరి బంధువులకు - సొంత మనుషులకు మేలు చేసే విధంగా మైనింగ్ వ్యవహారాల్లో తలదూర్చి సెటిల్ మెంట్లు చేస్తున్నట్లుగా విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వంలో ఉంటూ అక్రమాలకు పాల్పడుతుడటం వంటి వ్యవహారాలపై సదరు నేతలను సీఎం కేసీఆర్ తీవ్రంగా హెచ్చరించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీలో జరుగుతున్న అక్రమాలన్నింటికి చెక్ పెట్టేందుకు గులాబీ బాస్ నేరుగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు పార్టీ నేతల పనితీరుపై నివేదికలు తెప్పించుకుంటున్నారని సమాచారం. పార్టీకి, ప్రభుత్వానికి మచ్చతెచ్చే వ్యవహారాలపై వెంటనే స్పందించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని టీఆర్ ఎస్ భవన్ వర్గాలు చెబుతున్నాయి. మంత్రులు - ఎమ్మెల్యేల కదలికలపై వారి అనుచరులతో గాని... కొంతమంది కింది స్థాయి నేతల నుంచి సీఎం వివరాలు సేకరిస్తున్నారనే ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోంది. పార్టీకి నష్టం చేకూర్చేలా వ్యవహరిస్తే వేటు తప్పదంటూ గులాబీ బాస్ హెచ్చరించారని తెలుస్తోంది.

మొత్తంగా గ‌తంలో ప్ర‌తిపక్ష నేత‌ల‌పై పెట్టిన నిఘా ఇపుడు సొంత వారిపై సీఎం కేసీఆర్‌ పెట్ట‌డం - అందులో భాగంగా టేపులు విడుద‌ల అవ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామంగా మారింది.