Begin typing your search above and press return to search.

అమరావతికి ఫస్ట్ బర్త్ డే

By:  Tupaki Desk   |   22 Oct 2016 7:28 AM GMT
అమరావతికి ఫస్ట్ బర్త్ డే
X
ఏడాది కిందట.. అక్కడంతా పొలాలు - పొలం గట్టపై భుజాన తువ్వాలు వేసుకుని లుంగీ కట్టుకుని నడుచుకుంటూ సాగిపోయే రైతన్నలు. కొందరి చేతిలో పాలక్యాన్లు.. ఇంకొందరి చేతిలో అరటి గెలలు. సన్నని రోడ్లపై ఎప్పుడో అత్తగారు పెట్టిన హీరో హోండాలు - పాత చేతక్ లు పై తిరుగాడే ఆసామీలు.

..కానీ, ఇప్పుడు విశాలమైన రోడ్లు - వాటిపై కొత్తకొత్త కార్లు. నిర్మాణంలో ఉన్న భారీ భవంతులు.. మరిన్ని నిర్మాణాలకోసం చదును చేసిన నేల.. టక్ - టైలతో తిరిగే అధికారులు... ఆంధ్రప్రదేశ్ మొత్తానికి పాలన కేంద్రంగా ఉన్న సచివాలయం.. అన్నీ అక్కడే.

ఏడాదిలోనే ఎంతో మార్పు. నవ్యాంధ్ర రాజధాని నగరంగా ఏడాది కిందట శంకుస్థాపన జరిగిన అమరావతిలో ఈ 365 రోజుల్లో ఎన్నో మార్పులు. మొత్తానికి ఫస్టు బర్త్ డే నాటికి అమరావతి ఎలా ఉందంటే..

పవిత్ర కృష్ణానదీ తీరంలోని తుళ్లూరు - తాడేపల్లి - మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల్లో 34,470 ఎకరాల్లో రాజధానికి రూపకల్పన చేసిన గత ఏడాది ఇదే రోజున ప్రధాని చేతులమీదుగా శంకుస్థాపన చేశారు. అయితే... రాజధాని పూర్తిస్థాయిలో రూపుదిద్దుకోవడానికి ముందే పాలన కేంద్రాన్ని నిర్మించాలన్న ఉద్దేశంతో చంద్రబాబు వెలగపూడిలో తాత్కాలిక సచివాలయాన్ని కేవలం 8 నెలల్లో నిర్మించారు. హైదరాబాద్‌ నుంచి ఉద్యోగులంతా తరలిరావడంతో ఇప్పటికే మొత్తం పాలనకు వెలగపూడి కేంద్రమైంది. 2018 డిసెంబరు నాటికి పూర్తిస్థాయి పరిపాలనా నగరాన్ని నిర్మించడానికి చంద్రబాబు సిద్ధమవుతున్నారు.

- రాజధానికి భూములిచ్చిన 22 వేల మంది రైతులకు సీఆర్‌ డీఏ రిటర్నబుల్‌ ప్లాట్ల పంపిణీ సాగుతుంది. ఇప్పటికే 10 గ్రామాల రైతులకు లాటరీ పద్ధతిలో ప్లాట్లు కేటాయించారు. మిగిలిన గ్రామాలకు నవంబరులోగా కేటాయించనున్నారు.

- అమరావతి ప్రాంతంలో వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తూ.. రాజధాని నిర్మాణం కారణంగా ఉపాధి కోల్పోయిన భూమిలేని నిరుపేదలకు ప్రభుత్వం నెలకు రూ.2,500 చొప్పున పింఛను అందిస్తోంది. 29 గ్రామాల్లో ప్రస్తుతం 19,189మందికి రూ.2,500 పింఛన్లు ఇస్తున్నారు.

- నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

- రాజధానిలో రవాణాకు ఉపయోగపడే సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణానికి గత జూనలోనే శంకుస్థాపన చేశారు. ఎక్స్‌ ప్రెస్‌ రోడ్డు నిర్మాణానికి సర్వే జరుగుతోంది.

- రాజధాని నగరం పెట్టుబడులకు స్వర్గధామంగా నిలుస్తోంది., విట్‌ - ఎస్‌ ఆర్‌ ఎం - అమృతానందమయి విశ్వవిద్యాలయాలకు స్థలాలు కేటాయించ గా.. ప్రముఖ హోటల్ గ్రూపులూ ఇక్కడ నిర్మాణాలకు ముందుకొస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/