Begin typing your search above and press return to search.

ఉచిత వైఫై....సో సెక్సీ గురు

By:  Tupaki Desk   |   24 July 2017 6:57 AM GMT
ఉచిత వైఫై....సో సెక్సీ గురు
X
ఉచిత వైఫై.. టెక్నాల‌జీ చేరువ చేసే క్ర‌మంలో ప్ర‌జ‌ల సౌక‌ర్యార్థం ఏర్పాటు చేసిన సౌల‌భ్యం. అయితే ఈ ఉచిత నెట్‌ అశ్లీల చిత్రాల వీక్షణకు ఉపయోగపడుతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల సైమన్‌ టెక్ అనే సంస్థ నిర్వహించిన నార్టన్ సర్వేలో ఉచిత వైఫై వాడుతున్న ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు అశ్లీల చిత్రాలు చూస్తున్నట్లు తేలింది. విచిత్రం ఏమిటంటే హోటళ్లు - విమానాశ్రయాలు - గ్రంథాలయాలు - పని ప్రదేశాలతోపాటు వీధుల్లోనూ భారతీయులు వీటిని చూస్తున్నారు.

ఫ్రీ వైఫై పై ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో వేయిమంది భారతీయులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇందులో ప్రతి ముగ్గురిలో ఒకరు తాము ఉచిత వైఫైని అశ్లీల దృశ్యాలు చూడటానికే ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.

-కేవలం భారతీయులు మాత్రమే చూస్తున్నారు అనుకుంటే పొరపాటే.. ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఆరుగురిలో ఒకరు ఉచిత వైఫై ద్వారా అశ్లీల చిత్రాలు చూస్తున్నట్లు సర్వేలో తేలింది. జపాన్ - మెక్సికో - నెదర్లాండ్స్ - బ్రెజిల్ - అమెరికా - యునైటెడ్ కింగ్‌ డమ్‌ లకు చెందిన ప్రజలు ఈ సర్వేలో పాల్గొన్నారు.

-మనదేశంలో.. హోటళ్లలో 49శాతం, స్నేహితుల ఇళ్లల్లో 46శాతం - కేఫ్‌ లు - రెస్టారెంట్లలో 36శాతం - ఆఫీసుల్లో 44శాతంమంది పోర్న్ చూస్తున్నారు.

-ఆసక్తికరంగా 31శాతంమంది వీధుల్లోనూ ఉచిత వైఫై ద్వారా ఈచిత్రాలు వీక్షిస్తున్నారు. బస్సు - రైళ్లలో 34శాతం - గ్రంథాలయాల్లో 24శాతం - విమానాశ్రయాల్లో 34శాతంమంది వినియోగిస్తున్నారు.

-ఉచిత వైఫై కలిగిన వారిలో 73శాతం మంది ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడటం లేదు. మంచి సిగ్నల్ కావాలని వారు కోరుకుంటున్నారు.

-అయితే ఉచిత వైఫై ఎంతవరకు సురక్షితం అనే విషయంలో మాత్రం ప్రజలకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయని సైమన్‌ టెక్ కంట్రీ మేనేజర్ రితేశ్ చోప్రా తెలిపారు. సురక్షితంకాని వైఫై వాడటంవల్ల తమ మొబైల్స్ - ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు సైబర్ నేరగాళ్లకు చిక్కుతాయని కొంతమంది భావిస్తుండగా.. చాలామంది భద్రతను ఫణంగా పెట్టి మరీ ఉచిత వైఫై వాడుతున్నారట.

-ఉచిత వైఫై ద్వారా 68శాతంమంది సామాజిక మాధ్యమాలు - 46శాతం ఈ-మెయిల్ ఐడీలు - 30శాతం మంది ఆర్థికకార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

-ఒకవేళ వ్యక్తిగత సమాచారం హ్యాకింగ్‌ కు గురైతే ఎలా.. అనే ప్రశ్నకు 33శాతం మంది తాము ఆగ్రహానికి గురవుతామని పేర్కొనగా, 30శాతం మంది అసహనాన్ని వ్యక్తం చేస్తామన్నారు. 41శాతంమంది ఆర్థిక విషయాలు చోరీకి గురికావడం, ఆన్‌ లైన్‌ లో ప్రచురించడం భయానక సంఘటనగా పేర్కొన్నారు.