ఫ్లైట్లో ఫోన్లు.. ఇంటర్నెట్ కు ఏడాది ఆగాలట!

Thu Jun 14 2018 07:00:01 GMT+0530 (IST)

టెక్నాలజీ అంతకంతకూ దూసుకెళుతున్న ఈ కాలంలోనే కొన్ని నిర్ణయాలు తీసుకోవటానికి ప్రభుత్వం అదే పనిగా కాలయాపన చేయటం సరికాదు. ఈ మధ్యన విమానాల్లో ప్రయాణించే వారు ఫోన్లో మాట్లాడుకునేందుకు వీలుగా సౌకర్యాన్ని అందుబాటులోకి తేనున్నట్లుగా పౌర విమానయాన సంస్థ వెల్లడించింది.
అయితే.. ఈ సౌకర్యం ప్రయాణికులకు అందుబాటులోకి రావాలంటే మరో ఏడాది టైం పడుతుందన్న విషయాన్ని స్పష్టం చేశారు కేంద్ర కమన్యూనికేషన్ల మంత్రి మనోజ్ సిన్హా. విమానాల్లో ప్రయాణించే వారు ఫోన్లు చేసుకోవటానికి.. ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకోవటానికి ఇప్పుడు అవకాశం లేదు. దీన్ని అధిగమించేలా సాంకేతికత కోసం ప్రయత్నాలు చేస్తున్నామని.. త్వరలోనే ఆ సౌకర్యం అందుబాటులోకి రానున్నట్లుగా చెప్పారు.అయితే.. ఇప్పటికిప్పుడు అలాంటిది సాధ్యం కాదని.. ఈ సాంకేతికత కోసం ఏడాది వరకూ ఆగాల్సి ఉంటుందన్న విషయాన్ని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. విమానాల్లో ఇంటర్నెట్.. ఫోన్ మాట్లాడుకునేందుకు వీలుగా సాంకేతికతను తీసుకురావాలన్న ప్రతిపాదనను ఇప్పటికే టెలికం శాఖ ఓకే చేసినట్లు చెబుతున్నారు. అత్యాధునిక సాంకేతికతను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తేవాలే కానీ.. ఇలా ఏళ్లకు ఏళ్లకు వాయిదా వేయటం సరికాదని చెప్పక తప్పదు.