Begin typing your search above and press return to search.

800 ఏళ్ల తర్వాత అరుదైన అక్టోబర్!

By:  Tupaki Desk   |   1 Oct 2016 5:12 PM GMT
800 ఏళ్ల తర్వాత అరుదైన అక్టోబర్!
X
ఇంతకాలం వచ్చిన అక్టోబరు మాసాలన్నీ ఒకెత్తు అయితే 2016 అక్టోబరు మరొకెత్తు! ఈ అక్టోబర్ అరుదైనదనంటూ సోషల్ నెట్‌ వర్క్‌ లో అదరగొట్టే పోస్టులు ఇప్పటికే హల్‌ చల్ చేస్తున్నాయి. అదేంటి.. ప్రతీ ఏటా వచ్చే ఒక నెల గురించి ఇంత హడావిడి చేయడం.. ఏమిటి ఈ నెల ప్రత్యేకత.. అంటారా? మరింత ముందు కెళ్లి చదివితే విషయం మొత్తం తెలుస్తుంది. అప్పుడు మీరే అంటారు.. వావ్... వాట్ ఏ అక్టోబర్ అని!

ఇంతకీ దీని గొప్పతనం ఏమిటంటే... ఇలాంటి అక్టోబరు నెల 8 శతాబ్దాలు (800 సంవత్సరాలు) తర్వాత వచ్చిన అరుదైన నెల అంట. గతంలో కాకతీయుల పాలన కాలం నాటి నెల మళ్లీ వచ్చిందని చెబుతున్నారు. సుమారు 863 ఏళ్ల క్రితం అంటే క్రీస్తు శకం 1153 వ సంవత్సరంలో వచ్చిన అక్టోబర్ నెలలో ఉన్న అరుదైన సంగతులు ఇప్పటి 2016 అక్టోబరులో ఉన్నాయట. వాటిలో ఒకటి.. అమావాస్య - పౌర్ణమి ఒకే నెలలో రావడం! ఇదే క్రమంలో ఈ అక్టోబరు నెలలో 11 న దసరా - 12 న మొహరం - 30 న దీపావళి... ఇలా మూడు పండుగలు ఒకే నెలలో రావడం.

ఇవే ప్రత్యేకతలు అనుకుంటుంటే - ఇప్పుడు చెప్పబోయే ప్రత్యేకత నిజంగా ప్రత్యేకమైందే. సాధారణంగా నెలకు నాలుగేసి వారాలు ఉంటాయి అన్న సంగతి అందరికీ తెలిసిందే.. కానీ, ఈ అక్టోబర్‌ లో మాత్రం ఐదేశి శని - ఆది - సోమవారాలు ఉన్నాయి. ఈ నెలలో శనివారాలు (1 - 8 - 15 - 22 - 29 తేదీలు), ఆదివారాలు (2 - 9 - 16 - 23 - 30 తేదీలు), సోమవారాలు (3 - 10 - 17 - 24 - 31 తేదీలు) వస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి ఈ నెల ప్రత్యేకమైందా కాదా? ఇక సెలవుల విషయంలోనూ ఈ నెల తన ప్రత్యేకతను చాటుకుంటుంది. ఈ నెలలో వచ్చే దసరా సెలవులతో పాటు ఐదు ఆదివారాలు, ఒక రెండవ శనివారం కలిపి సుమారు 17 రోజులపాటు పాఠశాలలు, కాలేజీలు, కంపెనీలకు సెలవులు. ఇక ప్రతి శని - ఆదివారాలు సెలవుండే ఐటీ ఉద్యోగుల గురించి ప్రత్యేకంగా చేప్పేదేముంది!!

ఇక ఇదే క్రమంలో ఈ నెలలో చాలా స్పెషల్ "డేస్" (దినోత్సవాలు) కూడా ఉన్నాయి. వాటి సంగతి కూడా ఒకసారి చూస్తే...

అక్టోబర్ 1 - ప్రపంచ వృద్ధుల దినోత్సవం - ప్రపంచ శాఖాహార దినోత్సవం - జాతీయ రక్తదాన దినోత్సవం
అక్టోబర్ 2 - మహాత్మాగాంధీ - లాల్ బహదూర్ శాస్త్రి - లోక్‌ నాయక్ జయప్రకాష్ నారాయణల జయంతులు
అక్టోబర్ 3 - వరల్డ్ అర్కిటెక్చిర్ డే
అక్టోబర్ 4 - ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం
అక్టోబర్ 5 - అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం
అక్టోబర్ 7 - ప్రపంచ నవ్వుల దినోత్సవం
అక్టోబర్ 8 - భారత వైమానిక దళ దినోత్సవం
అక్టోబర్ 10 - జాతీయ తపాలా దినోత్సవం
అక్టోబర్ 11 - విజయ దశమి (దసరా) - ప్రపంచ బాలికల దినోత్సవం
అక్టోబర్ 12 - మొహరం - సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చిన రోజు
అక్టోబర్ 13 - అంతర్జాతీయ ప్రకృతి వైఫరీత్యాల నిరోధక దినోత్సవం
అక్టోబర్ 14 - వరల్డ్ ఎగ్ డే
అక్టోబర్ 15 - అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవం
అక్టోబర్ 16 - ప్రపంచ ఆహార దినోత్సవం - మహర్షి వాల్మికి జయంతి
అక్టోబర్ 17 - పేదరిక నిర్మూలన దినోత్సవం
అక్టోబర్ 21 - పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
అక్టోబర్ 24 - ఐక్య రాజ్య సమితి వ్యవస్థాపక దినోత్సవం
అక్టోబర్ 26 - గృహహింస చట్టం అమలులోకి వచ్చిన రోజు
అక్టోబర్ 29 - నరక చతుర్ధశి
అక్టోబర్ 30 - దీపావళి - ప్రపంచ పొదుపు దినోత్సవం
అక్టోబర్ 31 - ఏక్తా దివాస్ సర్థార్ వల్లబాయ్ పటేల్ జయంతి