Begin typing your search above and press return to search.

వీడియో రిలీజ్ చేసిన శివాజీ.. వ‌డ‌దెబ్బ కొట్టింద‌ట‌!

By:  Tupaki Desk   |   18 May 2019 11:42 AM GMT
వీడియో రిలీజ్ చేసిన శివాజీ.. వ‌డ‌దెబ్బ కొట్టింద‌ట‌!
X
గ‌డిచిన కొద్ది రోజులుగా టీవీ9-అలందా మీడియాల మ‌ధ్య నెల‌కొన్న వివాదం గురించి తెలిసిందే. ఈ ఎపిసోడ్ లో అధికారికంగా టీవీ9 వాటాలు లేని న‌టుడు శివాజీ పేరు రావ‌టం.. ఆ వ్య‌వ‌హారం కాస్త గంద‌ర‌గోళంగా ఉండ‌టం తెలిసిందే. ఈ వ్య‌వ‌హారంలో ర‌విప్ర‌కాశ్ తో పాటు శివాజీ పేరుతో సైబ‌రాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇప్ప‌టివ‌ర‌కూ రెండు..మూడుసార్లు నోటీసులు జారీ చేసి.. తాజాగా లుక్ అవుట్ నోటీసులు విడుద‌ల చేసిన స‌మ‌యంలో శివాజీ ఒక వీడియోను విడుద‌ల చేశారు.

త‌న‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల్ని కొట్టిపారేసిన ఆయ‌న‌.. ర‌విప్ర‌కాశ్ త‌న‌కు మ‌ధ్య ఉన్న సివిల్ ఇష్యూను క్రిమిన‌ల్ ఇష్యూగా మార్చార‌న్న ఆయ‌న‌.. తాను ఎక్క‌డికి పారిపోలేద‌ని.. వ‌డ‌దెబ్బ త‌గ‌ల‌టంతో తాను రెస్ట్ తీసుకుంటున్న‌ట్లు చెప్పారు.నాలుగు రోజుల్లో పోలీసుల ముందుకు వ‌స్తాన‌న్న ఆయ‌న‌.. మైహోం రామేశ్వ‌ర‌రావు త‌న‌కు బాగానే ప‌రిచ‌యం ఉంద‌ని.. ఆయ‌న పిలిస్తే వెళ్లి.. అన్ని విష‌యాలు చెప్పేసేవాడిన‌ని వ్యాఖ్యానించారు.

ఇంత‌కూ శివాజీ విడుద‌ల చేసిన ఎనిమిది నిమిషాల (క‌చ్ఛితంగా అయితే 7.57 నిమిషాలు) వీడియోలో ఉన్న ముఖ్యంశాలు చూస్తే..

+ 2018లో టీవీ9 షేర్లుకొన్నా. యాజ‌మాన్యం మారింది కాబ‌ట్టి షేర్లు అడిగా. ఇందులో త‌ప్పేముంది? ర‌విప్ర‌కాశ్ .. నాకు మ‌ధ్య జ‌రిగిన ఒప్పందం గురించి జోక్యం చేసుకోవ‌టానికి కౌశిక్ రావు ఎవ‌రు?

+ కౌశిక్ రావు ఫిర్యాదుతో తెలంగాణ పోలీసులు మా ఇంటిపై దాడి చేసి నానా హంగామా చేశారు. సోదాలు చేసినా ఏమీ దొర‌క‌లేదు. నా భార్య‌తో సంత‌కం చేయించుకొని వెళ్లిపోయారు.

+ రెండేళ్లుగా తెలంగాణ ప్ర‌భుత్వం నా మీద ప‌గ ప‌ట్టింది. ఇందులో కొంత‌మంది ఆంధ్రా నాయ‌కులు కూడా ఉన్నారు. నేను హైద‌రాబాద్ సెటిల‌ర్ ని.. స్థాన‌బ‌లం లేద‌నుకుంటున్నారు. నా మీద వంద కాదు.. వెయ్యి కేసులు పెట్టుకున్నా భ‌య‌ప‌డేదేమీ లేదు. ఇప్పుడు పెట్టిన‌వ‌న్నీ సిల్లీ కేసులు.

+ సోష‌ల్ మీడియాతో కొంద‌రు శున‌కానందం పొందుతున్నారు. నాపై రాళ్లు విసిరితే..విసిరిన వాళ్ల‌కే త‌గులుతాయి. మైహోమ్ అధినేత రామేశ్వ‌ర‌రావు నాకు బాగా తెలుసు. ఆయ‌న పిలిచి అడిగితే అన్నీ చెప్పేవాడిని.

+ నేనెక్క‌డికి పారిపోలేదు. వ‌డ‌దెబ్బ త‌గిలి విశ్రాంతి తీసుకుంటున్నా. నెహ్రూ తొమ్మిదేళ్లు జైల్లో ఉన్నారు. అయ‌న‌కేమైనా జ‌రిగిందా?

+ పోలీసులు న‌న్నేమైనా చంపేస్తారా ఏంటి? కుట్ర‌లో భాగంగానే ఇరికించారు. అన‌వ‌స‌రంగా నా మీద టీవీలో డిబేట్లు పెడుతున్నారు. అలాంటి ప‌ని చేయొద్దు. నిజాయితీగా బ‌య‌ట‌కు వ‌స్తా. నాలుగు రోజుల్లో సైబ‌రాబాద్ పోలీసుల్ని వ‌చ్చి క‌లుస్తా.