Begin typing your search above and press return to search.

మోడీకి ఆ స్టార్ హోట‌ల్ రూం ఎందుకు ఇవ్వ‌లేదు

By:  Tupaki Desk   |   20 Feb 2018 7:40 AM GMT
మోడీకి ఆ స్టార్ హోట‌ల్ రూం ఎందుకు ఇవ్వ‌లేదు
X
ఆయ‌న సాక్షాత్తు దేశానికి ప్ర‌ధాన‌మంత్రి. బ‌ల‌మైన రాజ‌కీయ పార్టీకి ర‌థ‌సార‌థి. సామాన్యుల ఆలోచ‌నల‌ ప్ర‌కారం చూస్తే...ఎప్పుడంటే అప్పుడు ఏది కావాలంటే అది క్ష‌ణాల్లో ఆయ‌న ముందు ఉంటుంది. కానీ బీజేపీ ర‌థ‌సార‌థి, ప్ర‌ధాని మోడీకి అలాంటి అవ‌కాశం దొర‌క‌లేదు. అంద‌రు సామాన్యుల ఆయ‌న‌కూ కోరిన దానిక విష‌యంలో నో అనే ఆన్స‌ర్ వ‌చ్చింది. దీంతో దొరికిన దానితోనే స‌ర్దుకుపోవాల్సి వ‌చ్చింది. ఇంత‌కీ మోడీ ఏం కోరారు...దేంతో స‌ర్దుకుపోయారు అనేది క‌దా మీ సందేహం... ఓ స్టార్‌ హోట‌ల్‌లో గ‌ది! ఔను. స్టార్ హోట‌ల్లో గ‌ది లేక‌పోవ‌డంతో స‌ర్దుకుపోవాల్సి వ‌చ్చింది.

రెండ్రోజుల పర్యటనలో భాగంగా ప్ర‌ధాని మోడీ క‌ర్ణాట‌క‌కు వెళ్లారు. అయితే మైసూర్‌లోని ప్రసిద్ధ లలితామహల్ హోటల్‌లో ప్రధాని మోడీకి చుక్కెదురైంది. ఆయ‌న‌కు రూమ్ లేద‌ని హోట‌ల్ యాజ‌మాన్యం చెప్పింది. ఓ పెళ్లి విందు కారణంగా హోటల్ గదులన్నీ నిండిపోవడంతో ప్రధాని పరివారానికి ఇవ్వలేమని యాజమాన్యం తేల్చి చెప్పింది. కేవ‌లం మూడు రూములు మాత్ర‌మే అందుబాటులో ఉన్నాయ‌ని దీంతోనే స‌ర్దుకుంటే త‌మ‌కేమీ ఇబ్బంది లేద‌ని తెలిపింది. అయితే...మోడీ స‌హాయ అధికారులు, సెక్యురిటీ బృందానికి అది స‌రిపోయే అవ‌కాశం లేక‌పోవ‌డంతో ప్ర‌ధాని స‌హా ఆయ‌న టీం మరో హోటల్‌ లో విడిది చేయాల్సి వచ్చింది.

ఇదిలాఉండ‌గా... మైసూరులో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం మహరాజ కాలేజీ మైదానంలో జరిగిన బహిరంగ సభలో ప్ర‌ధాని మోడీ ప్రసంగించారు. కాంగ్రెస్‌ హయాంలో కర్ణాటక అవినీతిమయమైందని ప్రధాని మోడీ విమర్శించారు. రాష్ట్రంలో రోజుకో కుంభకోణం బయటపడుతోందన్నారు. తాను ఇటీవల బెంగళూరు సభలో సిద్దరామయ్య సర్కారును పది శాతం కమీషన్ల ప్రభుత్వమని విమర్శించానని, అయితే అది అంతకంటే ఎక్కువని తనకు తర్వాతే తెలిసిందన్నారు. కర్ణాటక సంపదను, ప్రజాధనాన్ని దోచుకుంటూ రాష్ట్రానికి దరిద్రం పట్టించిన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడాలని మోడీ పిలుపునిచ్చారు. రాష్ట్రాభివృద్ధికి బీజేపీనే గెలిపించాలని కోరారు. రోజుకో కొత్త అబద్ధం చెబుతూ ప్రజలను మోసం చేసేందుకు రాష్ట్రసర్కారుప్రయత్నిస్తోంది అని విమర్శించారు.

కర్నాటక పర్యటనలో మోడీ బెంగళూరు–మైసూరు సిక్స్‌–లేన్‌ హైవే ప్రాజెక్టుకోసం 6,400 కోట్లను ప్రకటించారు. మైసూరులో రూ.800 కోట్లతో ప్రపంచస్థాయి శాటిలైట్‌ రైల్వేస్టేషన్‌ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.