Begin typing your search above and press return to search.

ఇమ్రాన్ ఇప్ప‌టివ‌ర‌కూ ఆహ్వానం పంప‌లేద‌ట‌!

By:  Tupaki Desk   |   10 Aug 2018 7:23 AM GMT
ఇమ్రాన్ ఇప్ప‌టివ‌ర‌కూ ఆహ్వానం పంప‌లేద‌ట‌!
X
మీడియా మాత్రం స‌మాచారం ఇచ్చే వేళ‌.. ప‌రిస్థితి ఒక‌ర‌కంగా ఉండేది. సోష‌ల్ మీడియా ఎంట్రీ త‌ర్వాత ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది. ఏ స‌మాచారం ఎప్పుడు ఎలా వ‌స్తుందో అర్థం కాని పరిస్థితి. కొన్ని.. సంబంధం లేని.. అవాస్త‌వ‌మైన వార్త‌లు సైతం నిజ‌మైన వార్త‌ల కంటే ఎక్కువ ప్రాధాన్య‌త‌తో స‌ర్య్కులేట్ అవుతున్న తీరు అంత‌కంత‌కూ పెరుగుతోంది.

పాకిస్థాన్ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన ఇమ్రాన్ ఖాన్‌.. త్వ‌ర‌లో పాక్ ప్ర‌ధానిగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు.ఈ ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వానికి ప్ర‌ధాని మోడీతో స‌హా.. ప‌లువురు మాజీ క్రికెట‌ర్లు.. బాలీవుడ్ న‌టుల‌కు ఆహ్వానం అందిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. త‌మ‌కు ఎలాంటి ఆహ్వానం అంద‌లేద‌ని పీఎంవో స్ప‌ష్టం చేసింది.

సోష‌ల్ మీడియాలో వ‌చ్చిన వార్త‌లు వైర‌ల్ కావ‌టంతో త‌మ‌కు ఆహ్వానం అంద‌లేద‌ని మ‌రికొంద‌రు తేల్చి చెప్పారు. రేపు (శ‌నివారం) లేదంటే.. ఆగ‌స్టు 14న ఇమ్రాన్ పాక్ ప్ర‌ధానిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసే అవ‌కాశం ఉంద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. పాక్ స్వాతంత్య్ర దినోత్స‌వ‌మైన ఆగ‌స్టు 14న ఇమ్రాన్ ప్ర‌మాణ‌స్వీకారం చేస్తే బాగుంటుంద‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. పాక్ నుంచి ఎలాంటి అధికారిక ఆహ్వానం త‌మ‌కు అంద‌లేద‌ని ప్ర‌ధాన‌మంత్రి మోడీ కార్యాల‌యం తాజాగా ప్ర‌క‌టించింది. ప్ర‌ధాని మోడీతో పాటు సార్క్ దేశాల అధినేత‌ల్ని ఇమ్రాన్ త‌న ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వానికి ఆహ్వానించిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. అలాంటిదేమీ లేద‌ని.. విదేశీ నేత‌లు ఎవ‌రినీ తాము ఆహ్వానించ‌లేద‌ని పాక్ విదేశాంగ శాఖ ప్ర‌క‌టించింది.

మ‌రోవైపు ఇమ్రాన్ ప్ర‌మాణ‌స్వీకారానికి ఎలాంటి ఆహ్వానం త‌మ‌కు రాలేద‌ని విదేశాంగ శాఖ స్ప‌ష్టం చేసింది. ఒక‌వేళ పాక్ నుంచి ఇమ్రాన్ ప్రమాణ‌స్వీకారానికి ఆహ్వానం అందిన‌ట్లుగా త‌మ‌ను సంప్ర‌దిస్తే.. వారు పాక్ కు వెళ్లేందుకు అనుమ‌తించాలా? వ‌ద్దా? అన్న అంశాన్ని చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని విదేశాంగ శాఖ స్ప‌ష్టం చేసింది.