Begin typing your search above and press return to search.

వెయ్యి నోటు రాదని తేల్చేశారు

By:  Tupaki Desk   |   22 Feb 2017 7:15 AM GMT
వెయ్యి నోటు రాదని తేల్చేశారు
X
కొత్త వెయ్యి రూపాయిల నోటు మీద సాగుతున్న చర్చకు పుల్ స్టాప్ పడినట్లే. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో రూ.వెయ్యి.. రూ.500 నోట్లను రద్దు చేయటం.. ఆ స్థానంలో రూ.2వేల నోటును మొదట తెచ్చిన మోడీ సర్కారు.. తర్వాత రూ.500నోట్లను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో రెండింటికి మధ్యనున్న రూ.వెయ్యి నోటు మళ్లీ ముద్రిస్తారన్న అంచనాలు వ్యక్తమయ్యాయి.

అయితే.. అలాంటిదేమీ లేదని.. వెయ్యి నోట్లను ప్రింట్ చేసే ఆలోచన ఏదీ ప్రభుత్వానికి లేదన్నవిషయాన్ని తాజాగా ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ తేల్చేశారు. కొత్తగా వెయ్యి రూపాయిల్ని ప్రభుత్వం తీసుకొస్తుందంటూ సాగుతున్న ప్రచారంలో అర్థం లేదన్న ఆయన.. వెయ్యి నోట్లను తీసుకొచ్చే ఆలోచన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని వెల్లడించారు.

ప్రస్తుతం రూ.500 నోట్లు.. ఇతర చిన్న నోట్లను సరిపడా ముద్రించటంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిన విషయాన్ని వెల్లడించిన ఆయన.. కొన్నిఏటీఎంలలో నగదు కొరత ఉందన్న ఫిర్యాదులు వస్తున్నాయని.. అవసరమైన మేరకే ప్రజలు నగదును విత్ డ్రా చేసుకోవాలన్న సూచన చేశారు. ఇలాంటి మాటలే మరింత గందరగోళానికి గురి చేసి.. జనాలు ఆగమాగం అయిపోయే అవకాశం ఉంది. నోట్ల రద్దు తర్వాత.. నగదు కొరత లేదని చెప్పుకుంటున్న ప్రభుత్వం.. కొరత తీర్చే దిశగా అడుగులు వేయాలే తప్పించి.. ఇలాంటి సలహాలు.. సూచనలు ప్రజలకు ఎంతకాలమని ఇస్తారు..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/