మహాకూటమిలో ఈ ఏడు సీట్లకు ఎవరూ పోటీపడట్లేదు

Fri Nov 09 2018 09:41:33 GMT+0530 (IST)

మహాకూటమి తరఫున మరో హాట్ టాపిక్ తెర మీదకు వచ్చింది. మహాకూటమి పేరుతో ప్రధాన పార్టీలను ఏకం చేసి అధికార టీఆర్ ఎస్ పార్టీపై కాలు దువ్వుతున్న కాంగ్రెస్ పార్టీని అంతర్గత సమస్యలు వెంటాడుతున్నాయి. ఓ వైపు ఎన్నికలు సమీపిస్తుంటే..మరోవైపు నాయకుల్లో అసంతృప్తి కూడా పెరిగిపోతోంది. టికెట్ల విషయంలో ఎంతగానో ఆశిస్తున్న కూటమి నేతలు..కొన్ని నియోజకవర్గాల విషయంలో అసలే మాత్రం స్పందించడం లేదట.ఏడు నియోజకవర్గాల విషయంలో తమకు ఏమాత్రం ఆసక్తి లేదని పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. అవే పాతబస్తీలోని ఏడు నియోజకవర్గాలు!గురువారం రాహుల్ నివాసంలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం సుమారు రెండు గంటలపాటు జరిగింది. ఈ భేటీలో కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. 10న ఉదయం తొలి జాబితాను విడుదల చేయాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. 74 మందితో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల కానుంది. మిగిలిన 20 మంది జాబితా రెండో జాబితాలో విడుదలవుంది. దీనికోసం ఈ నెల 11 - 12 న మరో విడుత కాంగ్రెస్ సీఈసీ సమావేశం కానుంది. మహాకూటమి భాగస్వామ్య పార్టీలకు కేటాయించిన 26 సీట్లలో టీడీపీకి 14 - టీజేఎస్ కి 8 - సీపీఐకి 3 సీట్లను కేటాయించారు. ఈ కేటాయింపుల్లో భాగంగా వచ్చే సీట్లలో పలు నియోజకవర్గాల కోసం పోటీ పడుతున్న నాయకులు...పాతబస్తీలోని ఏడు నియోజకవర్గాల విషయంలో ఏమాత్రం స్పందించడం లదేంటున్నారు. ఆ నియోజకవర్గాల్లో తాము పోటీ చేయబోమని వారు తేల్చిచెప్తున్నట్లు సమాచారం. పాతబస్తీలో ఎంఐఎం బలంగా ఉన్న - అక్కడి ఓటర్లు వేరే పార్టీకి ఓటు వేసేందుకు పెద్దగా  ఆసక్తిచూపని నేపథ్యంలో కూటమి నేతలు ఈ రకంగా వ్యవహిస్తున్నారని టాక్.