Begin typing your search above and press return to search.

మోదీ బ్లండ‌ర్ - 500 రోజుల త‌ర్వాత నో క్యాష్

By:  Tupaki Desk   |   17 April 2018 4:50 PM GMT
మోదీ బ్లండ‌ర్ - 500 రోజుల త‌ర్వాత నో క్యాష్
X
న‌వంబ‌రు 8 - 2016.....భార‌త దేశ చ‌రిత్ర‌లో ఓ చారిత్ర‌క దినం......ఆ రోజు జ‌రిగిన పెద్ద నోట్ల ర‌ద్దు....చారిత్ర‌క ఘ‌ట‌న‌గా నిలిచిపోతుందన‌డంలో ఎటువంటి సందేహం లేదు. ఈ తేదీ గుర్తుకు వ‌స్తేనే స‌గ‌టు భార‌తీయుడి వెన్నులో వ‌ణుకుపుడుతుంది....గుండెల్లో గుబులు మొద‌లవుతుంది....క‌ష్ట‌ప‌డి సంపాదించుకున్న సొమ్ము కోసం కిలో మీట‌ర్ల కొద్దీ క్యూలైన్లలో ప‌డిగాపులు కాసిన ఘ‌ట‌న‌లు మ‌దిలో మెదులుతాయి.....ఖాతాలో ల‌క్ష‌ల కొద్దీ డ‌బ్బుండీ...బిచ్చ‌గాడిలా జేబులో చిల్లిగ‌వ్వ లేకుండా తిరిగిన రోజులు గుర్తుకు వ‌స్తాయి....ఆ స‌మ‌యంలో ప్ర‌ధాని మోదీ కార్చిన మొస‌లి క‌న్నీరు....దీనంగా చేసిన ఎమోష‌న‌ల్ బ్లాక్ మెయిల్ ప్ర‌క‌ట‌న గుర్తుకు వ‌స్తుంది....`నాకు 50 రోజులు స‌మ‌యం ఇవ్వండి....ఒక‌వేళ పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం త‌ప్ప‌ని తేలితే...న‌న్ను స‌జీవంగా కాల్చేయండి` అంటూ క‌న్నీటి ప‌ర్యంత‌మైన మోదీ మోము జ్ఞ‌ప్తికి వ‌స్తుంది. ఆనాడు మోదీ అన్న‌ట్లుగా దేశ ప్ర‌జ‌లంద‌రూ 50 రోజులు ఓపిక ప‌ట్టారు.....అయినా ప‌రిస్థితి మార‌లేదు....ఆ 50 రోజులు కాస్తా 500 రోజులైంది....ఇప్ప‌టికీ ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న‌ట్లు ప‌రిస్థితులున్నాయి. పెద్ద‌నోట్ల ర‌ద్దు జ‌రిగిన 500 రోజుల త‌ర్వాత కూడా దేశంలో న‌గ‌దు కొర‌త తీవ్రంగా ఉండ‌డంపై సోష‌ల్ మీడియాలో మోదీపై విమ‌ర్శ‌ల పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఆ పోస్టులు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

భార‌త దేశ ప్ర‌జ‌ల‌ను ప్ర‌ధాని మోదీ....50 రోజుల స‌మయం అడిగారు....దేశ ప్ర‌జ‌లు ఆయ‌న‌కు 500 రోజులిచ్చారు. అయినా, ప‌రిస్థితిలో మార్పు రాలేదు...అవే ఖాళీ ఏటీఎంలు....అవే కిలోమీట‌ర్లు కొద్దీ క్యూ లైన్లు...అంటూ నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ``మా న‌గరంలో ఉన్న 10 ఏటీఎంల‌లో ఒక‌దాంట్లోనే డ‌బ్బులు వ‌స్తున్నాయి. మా అమ్మ‌మ్మ వాళ్ల ఊళ్లో ఒక‌టే ఏటీఎం ఉంది ...అక్క‌డ జ‌నం బారులుతీరి ఉన్నారు. ఎస్ బీఐ - పోస్ట్ ఆఫీస్ ఏటీఎంల‌లో అస‌లు డ‌బ్బులే లేదు. పెద్ద నోట్ల ర‌ద్దు చేసిన 500 రోజుల త‌ర్వాత ప‌రిస్థితి ఇది.`` అంటూ ఓ నెటిజ‌న్ పెట్టిన ట్వీట్ సోషల్ మీడియాలో వైర‌ల్ అయింది. మోదీ....50 రోజుల స‌మయం అడిగారు....దేశ ప్ర‌జ‌లు ఆయ‌న‌కు 500 రోజులిచ్చారు...మ‌రి ఇప్పుడు మోదీ ఏం చేస్తారు? అంటూ సెటైర్లు వేస్తున్నారు. దీనికి తోడూ...ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ....కొన్ని ప్రాంతాల్లో మాత్ర‌మే న‌గ‌దు కొర‌త ఉందంటూ చేసిన‌ నిర్ల‌క్ష్య‌పూరిత ట్వీట్ పై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు.