Begin typing your search above and press return to search.

నితీశ్ ప్రధాని.. ఉప ప్రధాని కేజ్రీవాల్ కావాలంట

By:  Tupaki Desk   |   2 May 2016 4:30 PM GMT
నితీశ్ ప్రధాని.. ఉప ప్రధాని కేజ్రీవాల్ కావాలంట
X
వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి.. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్మన్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యల్ని చేశారు. ప్రముఖ సోషల్ నెట్ వర్క్ అయిన ఫేస్ బుక్ లో ఆయన చేసిన తాజా వ్యాఖ్య ఇప్పుడు సంచలనంగా మారింది. దేశ ప్రధానిగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కావాలని.. ఉప ప్రధానిగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.

వారిద్దరికి సంబంధించిన వ్యక్తిగత విమర్శల్ని తాను ఎప్పుడూ వినలేదని ఆయన వ్యాఖ్యానించారు. తాను రాజకీయ నాయకుల్ని నిత్యం విమర్శిస్తూనే ఉంటానని.. గతంలో నితీశ్.. కేజ్రీవాల్ ను కూడా విమర్శించి ఉండొచ్చన్న కట్జూ.. ఉన్నంతలో మంచివాళ్లను ఎన్నుకోవాల్సిన అవసరం ఉందనటం గమనార్హం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కట్జూ అంతలా పొగిడేసిన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ మీద ఒక యువకుడు చెప్పు విసరటం.. అదొచ్చి నేరుగా ఆయన ఛాతీని తాకటం ఒక ఎత్తు అయితే.. దేశంలో నితీశ్.. కేజ్రీ మినహా మంచి నేతలంటూ లేరా? రాజు పెద్ద భార్య మంచిదంటే.. చిన్న భార్య...?