Begin typing your search above and press return to search.

గడ్కరీ పెళ్లికి ఖర్చు లెక్క చెప్పేవారెవరు?

By:  Tupaki Desk   |   4 Dec 2016 7:38 AM GMT
గడ్కరీ పెళ్లికి ఖర్చు లెక్క చెప్పేవారెవరు?
X
నోట్ల రద్దు నేపథ్యంలో ఇప్పుడు కొత్త చిక్కులు చాలానే మొదలయ్యాయి. చేతిలో డబ్బులు లేకపోవటం..బ్యాంకు ఖాతాలో డబ్బులున్నా.. అనేక పరిమితులతో పాటు.. బ్యాంకుల వద్దా కరెన్సీ కొరత తీవ్రంగా ఉండటంతో నోట్ల కోసం పాట్లు రోజురోజుకి పెరిగిపోతున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. ఏదైనా శుభకార్యం చేయాలంటే చుక్కలు కనిపించే పరిస్థితి.

అన్నింటికి మించి పెళ్లిళ్ల లాంటి వేడుకలు చేపట్టాల్సి వస్తే.. చేతిలో క్యాష్ లేక కిందామీదా పడాల్సి వస్తోంది. ఆన్ లైన్ చెల్లింపులు సదుపాయం ఉన్నప్పటికీ.. పలు సేవలకు నగుదు చెల్లించాల్సి రావటం ఉంటుంది. ఇలాంటి వేళ.. మొనగాళ్లు లాంటి వారు సైతం.. నగదు కోసం నానా పాట్లు పడాల్సి వస్తోంది. ఇలాంటి కష్టాల వేళ.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తన కుమార్తె వివాహాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రలోని నాగపూర్ లో వివాహ వేడుకలు జరుగుతున్నాయి.

సామాన్యుడి పెళ్లి కోసం నగదు కోసం పడుతున్న పాట్లు.. కేంద్రమంత్రికి కూడా తాకాయా? లేక.. ఆయనకు అలాంటి ఇబ్బందులు ఏమీ ఎదురుకాలేదా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.పలువురు కేంద్రమంత్రులు.. వీవీఐపీలు.. సెలబ్రిటీలు వస్తున్న ఈ వివాహ వేడుకలకోసం అయ్యే ఖర్చు.. దానికి కేంద్రమంత్రి చెల్లింపుల లెక్కను దేశ ప్రజలకు వివరంగా చెబితే.. ఆయన మేనేజ్ మెంట్ థియరీ పలువురికి సాయం చేస్తుందన్న మాట వినిపిస్తోంది. మరి.. పెళ్లి లెక్కను గడ్కరీ చెబుతారా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/