Begin typing your search above and press return to search.

ఏడేళ్లైనా శిక్ష అమ‌లేదీ?..నిర్భ‌య పేరెంట్స్ వినూత్న నిర‌స‌న!

By:  Tupaki Desk   |   25 April 2019 4:54 PM GMT
ఏడేళ్లైనా శిక్ష అమ‌లేదీ?..నిర్భ‌య పేరెంట్స్ వినూత్న నిర‌స‌న!
X
నిర్భ‌య ఘ‌ట‌న‌... దేశాన్ని భారీగానే కుదిపేసింది. ఎక్క‌డెక్క‌డి యువ‌త ఢిల్లీలోని అత్యంత ప‌టిష్ట భ‌ద్ర‌త ఉన్న రైసినా హిల్స్ బారీకేడ్ల‌నే బ‌ద్ద‌లు కొట్టింది. స్నేహితుడితో క‌లిసి బ‌య‌ట‌కు వ‌చ్చిన విద్యార్థినిపై కీచ‌క మూక బ‌స్సులోనే దారుణాతి దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్ప‌డింది. ఆ ఘ‌ట‌న విన్న ప్ర‌తి భార‌తీయుడు ఆగ్ర‌హావేశాల‌తో ఊడిపోయాడు. జ‌నం మాదిరే ప్ర‌భుత్వం కూడా ఈ ఘ‌ట‌న‌పై వేగంగానే స్పందించింది. నిందితుల‌ను అరెస్ట్ చేసింది. అంతే్కాకుండా అత్యాచారాల‌పై క‌ఠిన చ‌ర్య‌ల‌కు శ్రీ‌కారం చుట్టి... ఏకంగా నిర్భ‌య చ‌ట్టాన్ని తీసుకువ‌చ్చారు.

అన్యాయానికి గురైన త‌మ కూతురు తిరిగి రాకున్నా... ఆమెను అంత‌మొందించిన వారికి శిక్ష ప‌డుతుంద‌ని ఆమె త‌ల్లిదండ్రులు భావించారు. వారు అనుకున్న‌ట్లుగానే ప్ర‌త్యేక కోర్టు కేసు విచార‌ణ‌ను పూర్తి చేసింది. దోషుల‌కు ఉరే స‌రి అంటూ సంచ‌ల‌న తీర్పు కూడా వెలువ‌రించింది. ప్ర‌స్తుతం దోషుల్లో కొంద‌రు చ‌నిపోగా... కొంద‌రు జైల్లో ఉన్నారు. వారికి ఉరి అమ‌లు చేసే విష‌యంపై మాత్రం ఎప్ప‌టిక‌ప్పుడు వాయిదాలు ప‌డిపోతున్నాయి. దీనిపై ఇప్పుడు నిర్భ‌య పేరెంట్స్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. నిర్భయ ఘ‌ట‌న జ‌రిగి ఏడేళ్లు పూర్తి అవుతున్నా... దోషులుగా తేలిన వారికి శిక్ష అమ‌లు చేయ‌డంలో మాత్రం వ్య‌వ‌స్థ విఫ‌ల‌మైపోయింద‌ని వారు ఆరోపిస్తున్నారు. ఇలాంటి వ్య‌వ‌స్థ తీరుకు నిర‌సన‌గా ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో ఓటేయ‌రాద‌ని నిర్భ‌త పేరెంట్స్ ఆశాదేవి, బద్రీనాధ్ సింగ్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు వారు తీసుకున్న నిర్ణ‌యంపై ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర లేసింద‌నే చెప్పాలి.

అమాయ‌కురాలిని ఘోరంగా హ‌త్యాచారం చేసిన నిందితులు దోషులుగా తేలినా, శిక్ష ఖ‌రారైనా కూడా ఆ శిక్ష అమ‌లు కాక‌పోవ‌డం ప‌ట్ల నిజంగానే ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. నిర్భ‌య దోషుల‌కు విధించే శిక్ష ద్వారా... భ‌విష్య‌త్తులో మ‌హిళ‌ల‌పై చేయి వేయ్యాలంటేనే భ‌య‌ప‌డేలా వ్య‌వ‌హ‌రిస్తామంటూ గొప్ప‌లు చెప్పిన ప్ర‌భుత్వాలు.. ఆ మాట‌ల‌ను అమ‌లు చేయ‌డంలో మాత్రం ఆస‌క్తి చూప‌డం లేదు. ఇదే మాట‌ను నిర్భ‌య పేరెంట్స్ కాస్తంత గ‌ట్టిగానే వినిపిస్తున్నారు. దోషులుగా తేలిన వారికి శిక్ష‌లు అమ‌లు చేయ‌కుంటే... ఇక త‌మ కూతురుకు ఏం న్యాయం జ‌రిగిన‌ట్ట‌ని ప్ర‌శ్నిస్తున్న వారు... ఈ వ్య‌వ‌స్థ నిష్క్రియాప‌రత్వానికి నిర‌స‌న‌గా ఈ ద‌ఫా ఓటేసి లేదంటూ తేల్చి చెప్పారు. మ‌రి వీరి సంచ‌ల‌న నిర్ణ‌యం ఈ సారైనా పాల‌కుల‌ను క‌దిలిస్తుంద‌ని ఆశిద్దాం.