Begin typing your search above and press return to search.

పవన్ పై పంచ్ వేసింది ఆయనా?

By:  Tupaki Desk   |   21 Feb 2017 7:42 AM GMT
పవన్ పై పంచ్ వేసింది ఆయనా?
X
నిన్న గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన చేనేత సత్యాగ్రహ సభలో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పటిలా ఆవేశంగానే ప్రసంగించిన సంగతి తెలిసిందే. చిన్న దెబ్బలకే పారిపోయే నాయకులు జనసేనకు అవసరం లేదని… యుద్ధ ట్యాంకులు వచ్చినా ఎదురొడ్డి నిలబడే వారు తనకు కావాలని పెద్ద పెద్ద మాటలు చెప్పారాయన. ఈ సందర్భంగా పవన్‌ ఓ విషయం చెప్పుకొని బాధపడ్డాడు. తనకేమీ బాధ లేదంటూనే తనలోని బాధను అభిమానుల ముందు పంచుకున్నాడు. ఓ నేత తనను విస్తరాకులు ఎత్తుకునేవాడిగా అభివర్ణించారని అన్నారు. సమాజంలో శుభ్రత చాలా ముఖ్యమని కాబట్టి తిన్న విస్తరాకులు ఎత్తివేసేవాడిగా తనను గుర్తించినా తనకేం బాధ ఉండదన్నారు. దీంతో పవన్‌ ను విస్తరాకులు ఎత్తివేసే వ్యక్తిగా అభివర్ణించింది ఎవరన్న దానిపై చర్చ జరుగుతోంది. పవన్ పై అంత ఘాటు డైలాగు కొట్టింది ఎవరై ఉంటారా అని అనుకుంటున్నారు. ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది.

పవన్ ను విస్తరాకులు ఎత్తేవాడని అన్నది ఓ టీడీపీ ఎంపీ. ఆ మధ్య చేనేత కార్మికులు పవన్‌ ను కలిసిన సమయంలో స్పందించిన హిందూపురం టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్ప ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వడ్డించే వ్యక్తి అని పవన్‌ కల్యాణ్‌ విస్తరాకులు ఎత్తుకునే వ్యక్తి అని కిష్టప్ప అన్నారు. విస్తరాలకు ఎత్తివేసే వ్యక్తి దగ్గరకు వెళ్లి సమస్యలు చెప్పుకుంటే ఏం వస్తుందని ఎద్దేవా చేశారు. అది గుర్తు పెట్టుకునే పవన్ ఇప్పుడు దాన్ని తలచుకుని బాధపడ్డారు. నిమ్మల కృష్ణప్ప వ్యాఖ్యలకు పవన్ ఇప్పుడు కౌంటర్ ఇచ్చారు.

అయితే... విమర్శలను గుర్తు చేసుకుని సమాధానాలిస్తున్న పవన్ మాత్రం మిగతా హీరోలపై విమర్శలు చేశారు. వారంలో ఒక రోజు చేనేత వస్త్రాలు ధరించాలని పిలుపునిచ్చిన ఆయన.. తానేమీ కూల్‌ డ్రింక్స్ తాగాల్సిందిగా పిలుపునివ్వడం లేదని, ఇది పాటించాలని అన్నారు. కూల్‌ డ్రింక్స్ ప్రకటనల్లో నటిస్తున్న హీరోలను టార్గెట్ చేసుకునే పవన్ ఈ మాట అన్నట్లుగా భావిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/