Begin typing your search above and press return to search.

చినరాజప్పకు పెద్ద షాక్..

By:  Tupaki Desk   |   19 Aug 2017 4:27 AM GMT
చినరాజప్పకు పెద్ద షాక్..
X
ఏపీలో ఉప ముఖ్యమంత్రుల పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంది. ఇప్పటికే ఓ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి ఎలాంటి ప్రాధాన్యం లేకుండా చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరో ఉముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పను కూడా మెల్లగా సైడ్ చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చిన్న రాజప్పను పక్కనపెడతూ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును తెరపైకి తీసుకొస్తున్నారన్న చర్చ గోదావరి జల్లాల్లో జరుగుతోంది.

తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చినరాజప్పను కాదని కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల బాధ్యతలను ప్రత్తిపాటి పుల్లారావుకు అప్పగించడంతో గోదావరి జిల్లాలో కొత్త చర్చ మొదలైంది. కాకినాడ కార్పొరేషన్ పరిధిలోని 48 డివిజన్లలో టీడీపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరి ఎంపిక బాధ్యతలు యనమల - కళావెంకట్రావు - చినరాజప్పలు తీసుకున్నారు. అలాగే ఈ ఎన్నికల బాధ్యతలు కూడా తొలుత చినరాజప్పకే అప్పగించారు.

అయితే సీట్ల కేటాయింపుపై పలువురు మంత్రుల నుంచి అభ్యంతరాలు రావడం.. వాటిని రాజప్ప తిప్పి కొట్టడంతో సీను రివర్సయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చినరాజప్పను ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించి, ఆ బాధ్యతలను పుల్లారావుకు అప్పగించినట్టు సమాచారం. గోదావరి జిల్లాల్లో కాపు నేత ముద్రగడతో తలనొప్పులు ఉన్న తరుణంలో ఆ వర్గానికిచెందిన సీనియర్ లీడర్ ను చంద్రబాబు ఇలా పక్కనపెట్డడం నష్టదాయకమేనని టీడీపీ వర్గాలు అంటున్నాయి.