Begin typing your search above and press return to search.

క్షణికానందం.. క్షణికావేశం.. ఒక ప్రాణం!

By:  Tupaki Desk   |   25 July 2016 11:22 AM GMT
క్షణికానందం.. క్షణికావేశం.. ఒక ప్రాణం!
X
మనిషి ప్రాణానికి ఉన్న విలువ ఎంత? ఇదేమి ప్రశ్న.. చాల చీపే కదా అనేది అత్యధికుల సమాధానమైతే.. అందుకు సాక్ష్యంగా నిలుస్తుంది తాజా సంఘటన! ఈ సంఘటనలో.. మనిషి ప్రాణానికి విలువ లేదు, అమ్మ తనానికి మనసు లేదు, పసి గుడ్డు అనే దయా లేదు వెరసి... తనకు ఈ లోకంలో ఉండే ఆసక్తి లేదు.. అలానే అనుకుందో ఏమో కానీ.. ఒక బిడ్డ పుట్టిన మరుక్షణమే తన తల్లి నిర్లక్ష్యాన్ని చూసి భరించలేక ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయింది.

విషయానికొస్తే.. ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో స్టేషన్ లో ఆగి ఉన్న రైలు బోగీలను శుభ్రం చేయడానికని ఒక అటెండెంట్ వెళ్లాడు. ఆ బాత్ రూం తలుపు తీసి చూసేసరికి.. కొన్ని నిమిషాల ముందే ఈ ప్రపంచానికి వచ్చిన ఒక పసి బిడ్డ రక్తం తడిలోనే పడి ఉంది. ఆ పరిస్థితిని చూసి కంగారు పడిన అతడు- స్టేషన్ మాస్టర్ కు విషయం చెప్పాడు. స్టేషన్ మాస్టారు వచ్చి చూసే సరికి.. ఆ పసిప్రాణానికి నూరేళ్లు నిండిపోయాయని తెలిసింది.

టాయ్ లెట్ రూం లో ఉన్న ఆ పసికందు ఆ దుర్వాసన భరించలేక విలవిలలాడి ఉంటుంది - వెక్కివెక్కి ఏడ్చి ఏడ్చి అలసి పోయి - కడుపు నింపడానికి తల్లిపాలు లేక - తన కన్నీరు సైతం నోటికి అందక.. ఈ మురికి సమాజంలో తాను బతకలేనని దేవుడిని కోరింది.. తిరిగి వెళ్లిపోయింది! అవును... క్షణికానందంలో చేసే మురికి పనులు - క్షణికావేశంలో తీసుకునే మురికి నిర్ణయాల విలువ ఒక ప్రాణం అని మురికి మనుష్యులు తెలుసుకోవాలని చెబుతూ ఆ ప్రాణం వెళ్లిపోయింది!