Begin typing your search above and press return to search.

గన్నవరం ఎయిర్ పోర్ట్ కొత్త టెర్మినల్ చూశారా?

By:  Tupaki Desk   |   23 Jan 2017 4:06 AM GMT
గన్నవరం ఎయిర్ పోర్ట్ కొత్త టెర్మినల్ చూశారా?
X
కొన్ని మాటల్లో చెప్పలేం. చెప్పేందుకు ప్రయత్నించినా.. కళ్లతో చూస్తే ఆ ఎఫెక్ట్ వేరుగా ఉంటుంది. ఇప్పుడు మేం చెప్పే అంశాన్ని వీలైనన్ని తక్కువ అక్షరాల్లో చెప్పాలనుకుంటున్నాం. ఎందుకంటే.. ఇప్పుడు మీరు కంటితో చూసే దాని గురించి ఎంత చెప్పినా తక్కువ చెప్పినట్లే. ఎందుకంటే.. కేవలం 11 అంటే 11 నెలల్లో ఏపీ రాజధానికి సమీపంలో ఉండే గన్నవరం ఎయిర్ పోర్ట్ కొత్త టెర్మినల్ నిర్మాణాన్ని రికార్డు సమయంలో పూర్తిచేయటం విశేషం.

ఇంత స్వల్ప వ్యవధిలో ఇంత భారీగా.. ఇంత గ్రాండ్ గా నిర్మించటం చాలా అరుదైన విషయంగా చెప్పాలి. భారీ ఎత్తున నిర్మించిన తాజా టెర్మినల్ లో పెద్ద ఎత్తున వచ్చే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. రద్దీకి అవకాశం ఇవ్వకుండా పెద్ద ఎత్తున చెకింగ్ తీరును ఆధునీకరించటం చూసినప్పుడు విస్మయం కలగక మానదు. ఇంతటి అద్భుతాన్నిస్వల్ప వ్యవధిలో ఎలా పూర్తి చేశారన్న భావనతో పాటు.. ఇలాంటివాటికి కారణం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని చెప్పక తప్పదు. ఉరుకులు పరుగుల మీద పనులు చేయించటంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా అన్న భావన కలగటం ఖాయం.

అదేమీ కాదు.. ఇదంతా ప్రచారహోరు అని భావిస్తే మాత్రం.. ఒకటిన్నర నిమిషం కంటే ఏడు సెకన్లు ఎక్కువగా ఉన్న ఈ వీడియోను చూసేస్తే.. గన్నవరం ఎయిర్ పోర్ట్ కొత్త టెర్మినల్ ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలుస్తుందని చెప్పక తప్పదు.




Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/