Begin typing your search above and press return to search.

ర‌జినీ రాజ‌కీయ ఎంట్రీ...ఫ్లెక్సీలు రెడీ

By:  Tupaki Desk   |   24 April 2017 4:27 PM GMT
ర‌జినీ రాజ‌కీయ ఎంట్రీ...ఫ్లెక్సీలు రెడీ
X

సూప‌ర్ స్టార్ ర‌జినీ కాంత్ పొలిటిక‌ల్ ఎంట్రీకి రంగం సిద్ధ‌మైందా? ఒక్క‌మాట‌తో త‌మిళ రాజ‌కీయాల‌ను శాసించ‌గ‌ల స‌త్తా ఉన్న ర‌జినీ రాజ‌కీయ ప్ర‌వేశం కోసం అంతా సిద్ధ‌మైందా? అంటే ఆయ‌న అభిమానుల హ‌డావుడి చూస్తే అవును అనే స‌మాధాన‌మే వ‌స్తోంది. తాను రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటాన‌ని ర‌జినీ ప్ర‌క‌టిస్తున్న‌ప్ప‌టికీ ఆయ‌న పాలిటిక్స్ లోకి రావ‌ల్సిందేని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఇన్నాళ్లు ప్ర‌తిపాద‌న‌ల‌కే ప‌రిమితం అయిన కార్య‌క‌ర్త‌లు ఇప్పుడు ఏకంగా పోస్ట‌ర్ల‌తో త‌లైవ‌ర్ రాజ‌కీయాల్లోకి రావాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు.

తాజాగా చెన్నై నగరంలో భారీ ఎత్తున ర‌జినీ అభిమానులు పోస్టర్లను ఏర్పాటు చేశారు. ర‌జినీకాంత్ నివాసముండే పోయెస్ గార్డెన్ సమీపంలోని రాధాకృష్ణన్ శాలై, జెమినీ ఫ్లైఓవర్ వద్ద ఈ పోస్టర్లు దర్శనమిచ్చాయి. 'ప్రజలు జీవించాలంటే నువ్వు పాలించాలి. ఈ భూమి మిమ్మల్నే నమ్ముకుంది. ప్రజలకు ఒక మంచి దారి చూపించండి' అన్న నినాదంతో అభిమానులు పోస్టర్లను అతికించడం గ‌మ‌నార్హం. ఈ పోస్ట‌ర్లు ఇప్పుడు త‌మిళ‌నాడులో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

ఇటీవ‌లి కాలంలో ర‌జినీ బీజేపీకి ద‌గ్గ‌రవుతున్నార‌ని వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ ర‌జినీ వాటిని తోసిపుచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ప‌రిణామాలు ఇలా ఉన్న‌ప్ప‌టికీ తాజాగా త‌లైవార్‌ అభిమానులు ఫ్లెక్సీలు వేయ‌డం ర‌జినీ పొలిటిక‌ల్ ఎంట్రీపై కొత్త చ‌ర్చ‌కు కార‌ణంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/