Begin typing your search above and press return to search.

ఏదీ ఆగట్లేదు.. కేసీఆర్ అనుకున్నట్టే..

By:  Tupaki Desk   |   14 Oct 2018 9:55 AM GMT
ఏదీ ఆగట్లేదు.. కేసీఆర్ అనుకున్నట్టే..
X
పోలీసులకు కొత్త వాహనాలొచ్చాయి. అలాంటి ఇలాంటివి కావు.. అత్యాధునిక జీపీఎస్ సౌకర్యం కలవట.. అందులో ఓ ల్యాప్ ట్యాప్, వాహనానికి ముందు అత్యాధునిక కెమెరా దాంతో తెలంగాణ పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రానికి భవిష్యత్ లో అనుసంధానిస్తారట.. ఎక్కడ ఏ నేరం జరిగినా లైవ్ లో చూడొచ్చట.. ఎక్కడ జరిగినా జీపీఎస్ సాయంతో ఆ ప్రాంతానికి సమీపంలోని ఈ వాహనానికి సిగ్నల్స్ అందగానే పోలీసులు చేరుకొని దాన్ని అరికడుతారన్నమాట.. ఇలా అమెరికా, బ్రిటన్ దేశాల తరహాలో ఇంత పకడ్బందీగా వ్యవస్థ సిద్ధమవుతోంది..

అంతా కేసీఆర్ అనుకున్నట్టే జరుగుతోంది. పోలీస్ వ్యవస్థ ఆధునికీరణకు కేసీఆర్ విశేష ప్రాధాన్యం ఇస్తున్నారు. శాంతి భద్రతల పర్యవేక్షణకు కృషి చేస్తున్నారు. మొత్తం వ్యవస్థను శాసించే పోలీసులను అత్యాధునిక రీతిలో తీర్చిదిద్దుతున్నారు. కోడ్ పేరుతో అన్నింటిని ఆపేసిన ప్రస్తుత ఎన్నికల కమిషన్ పోలీసులకు వాహనాలను ఇచ్చే ప్రక్రియను మాత్రం ఆపలేదు. దీనికి కోడ్ వర్తించదు. కరెక్టే కానీ పోలీస్ అవసరాలు తీర్చే ఈ మంచి పనికి ఎవ్వరూ అడ్డుచెప్పకపోవడం విశేషమే. దీన్ని ఎన్నికల కోణంలో చూడకపోవడం శుభపరిణామమే.. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే పోలీసుల కోసం పెద్ద ఎత్తున బడ్జెట్ రిలీజ్ చేసి వారికోసం ముందస్తుగానే ఈ ఆర్డర్ లు ఇచ్చేశారు. ఇటీవలే దాదాపు 10వేలకు పైగా ఇన్నోవా వాహనాలు, ద్విచక్రవాహనాలను పోలీసులకు సమకూరాయి. వాటిని పంపిణీ చేశారు. వాటితో నిఘా వ్యవస్థను కట్టుదిట్టం చేశారు.

నిజానికి పోలీసు వ్యవస్థ చాలా కీలకం.. ఆ పోలీసులను ఉపయోగిచే కేసీఆర్ ఏపీ సీఎం చంద్రబాబును ఓటుకు నోటు కేసులో ఇరికించారు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల వేళ కూడా పోలీసులదే కీలక పాత్ర. అయినా కాంగ్రెసోళ్లు ప్రతీదాన్ని టీఆర్ఎస్ అనుకూల కోణం చూస్తూ కమిషన్ కు ఫిర్యాదు చేస్తూ అన్ని పంపిణీలను ఆపించేస్తున్నారు. కానీ ఈ పోలీస్ వాహనాల పంపిణీ మాత్రం ఆ కోణంలో చూడకపోవడం విశేషమే మరి..అయినా అదీ ఈసీ కిందకు రాదు కాబట్టి సరిపోయింది లేకుంటే ఈ వాహనాల పంపిణీ కూడా నిలిచిపోయేదే...మొత్తానికి పోలీసులకు ఆ వాహనాలను పంచేశారు. కానీ ఈ విషయాన్ని ఎవ్వరూ లేవనెత్తకపోవడం విశేషమనే చెప్పాలి.