Begin typing your search above and press return to search.

కోడెల కంప్యూటర్ల చోరీలో ఊహించని ట్విస్ట్

By:  Tupaki Desk   |   25 Aug 2019 7:32 AM GMT
కోడెల కంప్యూటర్ల చోరీలో ఊహించని ట్విస్ట్
X
టీడీపీ అధికారంలో ఉండగా అధికార వ్యవస్థలన్నింటిని తెగ వాడేసుకున్నాడన్న ఆరోపణలు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదర్ రావు ఫ్యామిలీ మెంబర్స్ పై వెల్లువెత్తాయి. ఏపీ అసెంబ్లీ ఫర్నిచర్ నుంచి మొదలు పెడితే గుంటూరు స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కంప్యూటర్ల దాకా సర్వం దోచేశారనే ఫిర్యాదులు తాజాగా వచ్చాయి..

అయితే గుంటూరు స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో 30 ల్యాప్ టాప్ కంప్యూటర్ల చోరీ కేసులో తాజా ట్విస్ట్ ఒకటి చోటుచేసుకుంది. మాజీ స్పీకర్ కోడెల తనయుడు కోడెల శివరామ్ ఈ 30 కంప్యూటర్లను చోరీ చేశాడని ప్రభుత్వ అధికారి బాజీ బాబు ఈనెల 23న పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.. పోలీసులు కేసు నమోదు చేసి సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు.

అయితే ఇప్పుడీ కేసులో ట్విస్ట్ నెలకొంది. 23న కేసు నమోదైతే 21నే 30 ల్యాప్ ట్యాప్ కంప్యూటర్లను ఓ అజ్ఞాత వ్యక్తి గుంటూరు డీఆర్డీఏ కార్యాలయంలో వాచ్ మెన్ కు చెప్పి వదిలివెళ్లాడట.. వాచ్ మెన్ అధికారులకు చెప్పలేదట..

కేసు నమోదయ్యాక ఈ విషయాన్ని తాజాగా వాచ్ మెన్ అధికారులకు చెప్పాడు. దీంతో అతడిని సస్పెండ్ చేసి ల్యాప్ ట్యాప్ లు వదిలివెళ్లిన వారిని పట్టుకోవాలని పోలీసులను అధికారులు కోరారు.

అయితే వాచ్ మెన్ ను మేనేజ్ చేసి కొట్టేసిన ల్యాప్ ట్యాప్ లను ముందే ఇచ్చినట్టుగా కోడెల శివరామే మేనేజ్ చేశాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో వాచ్ మెన్ ను మచ్చిక చేసుకొని ఈ తతంగం నడిపారని అర్థమవుతోంది. ల్యాప్ ట్యాప్ చోరీ నుంచి తప్పించుకునేందుకే ఇలా డ్రామాలు ఆడుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.