నటి హత్య కేసులో ట్విస్ట్... సినిమా కోసం ఇదంతా

Mon Feb 11 2019 15:22:17 GMT+0530 (IST)

తమిళ నటి సంధ్య హత్య కేసు కేవలం తమిళనాడులోనే కాకుండా సౌత్ ఇండియా మొత్తం చర్చనీయాంశం అయ్యింది. సంధ్య మృతదేహం మొత్తం ఏడు భాగాలుగా చేయడంతో ఆమెను గుర్తించడమే పోలీసులకు కష్టం అయ్యింది. చాలా లోతుగా విచారణ జరిపిన పోలీసులకు ఆ శవం సంధ్యదిగా తెలిసింది. పెరుంగుడి చెత్తకుప్పలో దొరికిన కాళ్లు చేతుల ఆధారంగా ఎంక్వౌరీ మొదలు పెట్టిన పోలీసులు తీగ లాగుతుంటే డొంక కదిలినట్లుగా షాకింగ్ విషయాలను వెలికి తీశారు.సంధ్య భర్త దర్శకుడు బాలకృష్ణన్ ఈ హత్య ఇతివృత్తంగా తీసుకుని థ్రిల్లర్ సినిమా తీయాలనుకున్నాడట. ఆమద్య బాలకృష్ణన్ స్నేహితుడు చెప్పిన స్క్రీన్ ప్లేలో శరీరంను ఏడు భాగాలుగా కత్తిరించి వేయాలని ఉందట. దాంతో బాలకృష్ణన్ తన భార్య సంధ్య శవంను ఏడు భాగాలుగా కోసి మరీ చెత్త కుప్పల్లో పడేశాడు. ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్న ఈ హత్య ఉదంతంతో ఇంకెన్ని నిజాలు వెలుగులోకి వస్తాయో అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దర్శకుడు బాలకృష్ణన్ కొన్ని రోజుల క్రితం 'కాదల్ ఇలవశం' అనే పేరుతో సినిమాను తీశాడు. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో తీవ్ర నష్టాల్లో ఉన్నాడు. మరో వైపు సంధ్య పలువురితో అక్రమ సంబంధాలు పెట్టుకుందని అనుమానం ఆయనకు ఉంది. ఆ కారణంగా సంధ్యను హత్య చేసి థ్రిల్లర్ సినిమాగా రూపొందించాలని భావించాడు. కాని మొత్తం సీన్ రివర్స్ అయ్యింది.