Begin typing your search above and press return to search.

గల్లా స్పీచు..సెటైర్లతో టీడీపీకి దిమ్మదిరుగుతోంది.

By:  Tupaki Desk   |   21 July 2018 8:30 AM GMT
గల్లా స్పీచు..సెటైర్లతో టీడీపీకి దిమ్మదిరుగుతోంది.
X

రామేశ్వరం పోయినా.. శనీశ్వరం వదలేనట్టుంది టీడీపీ పరిస్థితి.. ప్రత్యేక హోదా ఇవ్వనని తేల్చిన బీజేపీని కడిగిపారేసే అవకాశాన్ని టీడీపీ చేజేతురాలా పోగొట్టుకుంది. బీజేపీ తీరును ఎండగట్టడం సంగతి అటు ఉంచి టీడీపీ ఎంపీ తమ ప్రసంగాల్లో సినిమా ప్రమోషన్ చేసుకున్నారని సోషల్ మీడియా సెటైర్లు పడుతున్నాయి.

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్ సాక్షిగా తన బామ్మర్ధి మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ సినిమా కథను వినిపించి మాట మీద ఎలా నిలబడాలో సినిమా చూసి నేర్చుకోవాలని హితబోధ చేయడం పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ‘భరత్ అనే నేను’ మూవీ కి అమేజాన్ లో ప్రచారం కల్పించేందుకు ఇలా చేశాడా అని సెటైర్లు వేస్తున్నారు.. బామ్మర్ధి మహేష్ పై ప్రేమతో గల్లా జయదేవ్ పార్లమెంట్ సాక్షిగా ఆ చిత్రానికి ప్రచారం చేశాడని ఎత్తిపొడుస్తున్నారు. ‘చంద్రబాబు నాయుడు తన ఎన్నికల మేనిఫెస్టోలో 600 హామీలు ఇచ్చారు. గల్లా జయదేవ్ గారు.. చంద్రబాబును ఒక్కసారి భరత్ అనే నేనును సినిమా చూడమనండి.. సినిమా చూసైనా మాట మీద నిలబడడం నేర్చుకొని ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేరుస్తాడేమో..’ అనే ప్రశ్న ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.

ఇక బాహుబలి సినిమాను ఉదహరిస్తూ ఆంధ్రాకు డబ్బులు ఇవ్వారా అని గల్లా ప్రశ్నించిన తీరును ఎండగడుతున్నారు. టీడీపీ ఎంపీ చేసిన ప్రసంగం లో.. హోదా గురించి పక్కనపెట్టి సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు.

‘దేవుడు బతికించాడు.. పార్లమెంట్ లో బాలక్రిష్ణ లేడు.. కొంపదీసి ఉండుంటే తన ఫేమస్ డైలాగులతో బీజేపీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేసేవాడేమో...’ అంటూ మరికొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇక అర్జున్ రెడ్డి సినిమాలోని బూతు డైలాగులను కూడా వాడుతూ టీడీపీ నేతలకు కౌంటర్లు ఇస్తున్నారు.

మొత్తంగా పార్లమెంట్ లో టీడీపీ ఎంపీ గల్ల జయదేవ్ స్పీచ్ చూశాక.. ఇది చంద్రబాబు అండ్ కో మైలేజ్ తీసుకురాలేకపోయిందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. పార్లమెంట్ లో బీజేపీని ఎండగట్టే గొప్ప అవకాశాన్ని చేజేతులా టీడీపీ చేజార్చుకుందని విమర్శిస్తున్నారు.