కోహ్లీ కెప్టెన్సీపై నెటిజన్ల ఫైర్!

Mon Jun 19 2017 15:19:05 GMT+0530 (IST)

దాయాదులతో జరిగిన ఘోర పరాభావాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కనీసం పోరాటం కూడా చేయకుండా ఓడిపోవడాన్ని తీవ్రమైన అవమానంగా భావిస్తున్నారు. పాక్ చేతిలో పరాభవానికి కోహ్లీ చెత్త కెప్టెన్సీ కారణమని మండిపడుతున్నారు.

తన తప్పుడు నిర్ణయాలతో మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకునే అద్భుతమైన అవకాశాన్ని కోహ్లీ నాశనం చేశాడని నెటిజన్లు విమర్శిస్తున్నారు. పాకిస్థాన్ జట్టుకు ఇమ్రాన్ ఖాన్ ఇచ్చిన సలహాను కోహ్లీ వినలేదా అని ప్రశ్నిస్తున్నారు. టాస్ గెలిస్తే పొరపాటున కూడా ఇండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించవద్దని ఇమ్రాన్ ఖాన్ సూచించిన సంగతి తెలిసిందే. టాస్ గెలిచిన కోహ్లీ  వ్యూహంతో పాక్ ను బ్యాటింగుకి ఆహ్వానించాడని దుమ్మెత్తిపోస్తున్నారు.

ఇక బౌలింగ్ విషయానికొస్తే ఈ టోర్నీలో ఇప్పటివరకు పెద్దగా రాణించని అశ్విన్ ను ఎలా ఆడించారని ప్రశ్నిస్తున్నారు. అశ్విన ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నప్పటికీ... కేదార్ జాదవ్ చేత ఎందుకు బౌలింగ్ చేయించడం లేదని విమర్శిస్తున్నారు. బుమ్రా ఒత్తిడికి లోనై నా కూడా అతడి స్పెల్ ఎందుకు మార్చలేదని అడుగుతున్నారు. ఫీల్డర్లను సరైన స్థానాల్లో ఉంచడంలో కోహ్లీ విఫలమయ్యాడని నెటిజన్లు మండిపడుతున్నారు.

ఇక ఫ్లాట్ పిచ్ పై కోహ్లీకి ఒక లైఫ్ వచ్చినా ఉపయోగించుకోకుండా  అమీర్ వంటి లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ ను ఆన్ సైడ్ ఆడాలన్న నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. టీమిండియా ఆటగాళ్ల బాడీ లాంగ్వేజ్ పై పాక్ ఆటగాళ్లు విజయం సాధించానరన్నారు. కేవలం హార్డిక్ పాండ్య ఒక్కడే జంకుబెంకు లేకుండా ఆడాడని పేర్కొంటున్నారు. ఈ వైఫల్యానికి పూర్తి బాధ్యత కోహ్లీదే  అనడంలో ఎలాంటి సందేహం లేదని నెటిజన్లు మండిపడుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/