Begin typing your search above and press return to search.

ప‌వ‌న్‌కు ఎదుర‌వుతున్న ప్ర‌శ్న‌లు ఇవేన‌ట‌

By:  Tupaki Desk   |   23 April 2018 5:41 PM GMT
ప‌వ‌న్‌కు ఎదుర‌వుతున్న ప్ర‌శ్న‌లు ఇవేన‌ట‌
X
జ‌న‌సేన అధినేత‌, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న దూకుడును పెంచిన సంగ‌తి తెలిసిందే. సినీ నటుడు పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం సృష్టిస్తున్నాయి. దీని వెనుక రాంగోపాల్ వర్మ ఉన్నాడని బయటకు రావడం..మా అసోసియేషన్ లో పవన్ నిరసన తెలియచేయడంతో ఒక్కసారిగా ఇది రాజకీయ రంగు పులుముకుంది. నిజాలను నిగ్గు తేలుద్దాం పేరిట ట్వీట్లు చేస్తున్నారు. 'బట్టలు విప్పి మాట్లాడుకుందాం' అంటూ మీడియాపై విమర్శనాస్త్రాలు చేపట్టారు. ఫ్యాక్షనిస్టుల ఆస్తులను జాతీయం చేయాలన్న ఓ చానల్‌ స్లోగన్‌పై సెటైర్‌ వేశారు. ఈ స్లోగన్‌కు వెనకాల కథ ఏంటి అంటూ పవన్‌ ప్రశ్నించారు. నిజమైన అజ్ఞాతవాసి ఎవరు అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. అజ్ఞాతవాసిని బ్లాక్‌మెయిలర్‌ అని సీఎం కేబినెట్‌ ర్యాంక్‌ మంత్రితో అన్నారు..ఆ కేబినెట్‌ మంత్రి ఒకరితో ఆ మాట చెప్పారని..ఆ ముఖ్యమంత్రి ఎవరు..? కేబినెట్‌ మంత్రి ఎవరు..? ఆ ఒక్కరు ఎవరు..? నిజాలను నిగ్గు తేలుద్దాం కార్యక్రమం నుంచి పవన్‌ కల్యాణ్‌..! అంటూ పవన్ సెటైర్స్ వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

దీనికి కొన‌సాగిపుగా తాజా ప‌వ‌న్ మ‌రో సంచ‌ల‌న ట్వీట్ చేశారు. తెలుగుదేశం పార్టీకి 2009-10 ఎన్నిక‌ల్లో ఇచ్చిన డొనేష‌న్ల వివ‌రాలు అంటూ ఓ ప్ర‌ముఖ మీడియా సంస్థ‌లో వాటాలు ఉన్న శ్రీ‌నిరాజు గురించి వివ‌రించారు. ఆయ‌న ఇచ్చిన లావాదేవీల తాలూకు ఆధారాలు పేర్కొంటూ ఈయ‌న ఎవ‌రు అంటూ ప్ర‌శ్నించారు. త‌ద్వారా అధికార పార్టీపై అనుమాన‌పు చూపులు ప‌డేలా చేశారు. అయితే ప‌వ‌న్ ట్వీట్‌పై నెటిజ‌న్లు ఘాటుగా స్పందిస్తున్నారు. ప‌వ‌న్‌కు అవ‌గాహ‌న లేకుండా ఇలా ట్వీట్ చేశారా? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. చెక్కురూపంలోనే శ్రీ‌నిరాజు పార్టీ ఫండ్ ఇచ్చార‌ని ఈ నేప‌థ్యంలో ఇందులో త‌ప్పిదం ఏముంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

మ‌రోవైపు టీడీపీని ప్ర‌శ్నిస్తున్న ప‌వ‌న్ త‌న సంగ‌తి ఎందుకు చెప్ప‌డం లేద‌ని కొంద‌రు నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. త‌న అన్న చిరంజీవి స్థాపించిన ప్ర‌జారాజ్యం పార్టీకి సంబంధించిన విరాళాల వివ‌రాల‌ను ప‌వ‌న్ వెల్ల‌డించ‌గ‌ల‌రా అని నిల‌దీస్తున్నారు. మ‌రోవైపు ఇటీవ‌లే ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో ప‌వ‌న్ కొనుగోలు చేసిన ఇంటికి 20 లక్షలు తో మాత్రమే చట్ట ప్రకారం గవర్నమెంట్ వాల్యూ తో రిజిస్టర్ చేసుకున్నామని అన్నారు. మరి 2 కోట్ల మార్కెట్ విలువ ఉన్న ల్యాండ్ 20 లక్షలు కు ఎలా కొన్నారని . ఒక వేళా వైట్ మనీ కాకుండా బ్లాక్ మనీ ఇచ్చారా ఇస్తే ఎంత ఇచ్చారు అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు .... అన్నింటికీ మించి ప్ర‌స్తుతం జ‌న‌సేన పార్టీకి ఎవ‌రూ నిధులు ఇవ్వ‌డం లేదా? ఒక‌వేళ ఇస్తే ఏ రూపంలో అవి వ‌స్తున్నాయి..వాటికి ప‌వ‌న్ ఏం స‌మాధానం ఇస్తారు అనే సందేహాలు స‌హ‌జంగానే నెటిజ‌న్ల రూపంలో వ్య‌క్త‌మ‌వుతోంది. దీనికి ప‌వ‌న్ ఏం స‌మాధానం ఇస్తారో మ‌రి.