Begin typing your search above and press return to search.

భార‌త్ ఛానెల్లు మొత్తం బంద్

By:  Tupaki Desk   |   29 Nov 2015 9:43 AM GMT
భార‌త్ ఛానెల్లు మొత్తం బంద్
X
ప్ర‌పంచంలో ఏకైక హిందూ దేశంగా ఉండి కొద్దికాలం క్రితం లౌకిక‌దేశంగా మారిన నేపాల్‌ లో ప‌రిస్థితుల ఇంకా కుదుట‌ప‌డ‌టం లేదు. నేపాల్‌ను హిందూ దేశంగా మారుస్తూ తీసుకున్న నిర్ణ‌యంపై స్థానిక మాదేశీ తెగ వాసులు చేప‌ట్టిన ఆందోళ‌న హింస రూపంలోకి మారి ఆ దేశంలో ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితుల‌కు కార‌ణ‌మైంది. కొద్దికాలంగా ఈ ప‌రిస్థితులు కుదుట‌ప‌డుతుంటే తాజాగా మ‌రో స‌మ‌స్య ఎదురైంది. అయితే ఈ స‌మ‌స్య వ‌ల్ల భార‌త దేశం చిక్కుల‌పాల‌వ‌డం గ‌మ‌నార్హం.

ఉప్పు - చక్కెర - వంట గ్యాస్ సిలిండర్లు వంటి నిత్యావసరాల్లో మెజార్టీ వాటాను మ‌న‌దేశం నుంచి నేపాల్‌ స‌మీకరించుకుంటుంది. అయితే ఇటీవ‌ల ఆ దేశంలో ఇబ్బందిక‌ర‌ ప‌రిస్థితుల నెల‌కొన్న రీత్యా అవి చ‌క్క‌బ‌డే వ‌ర‌కు స‌రుకులు ర‌వాణా చేయ‌వ‌ద్ద‌ని భార‌త్ తాత్కాలికంగా నిలిపివేసింది. కానీ ఆయా స‌రుకులు అక్ర‌మ రవాణా అవుతున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో భారత జవాన్లు భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్ట‌డం చేశారు. ఈ క్ర‌మంలోనే భారత్ నుంచి నేపాల్ కు అక్రమ రవాణా అవుతున్న ఆయిల్ ట్యాంకర్ ను పట్టుకునేందుకు నేపాల్ భూభాగంలోకి కిషన్ గంజ్ లోకి మ‌నదేశ సైన్యం అయిన సశస్త్ర సీమా బల్ కు చెందిన జ‌వాన్లు ప్రవేశించారు. దీనిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన నేపాలీ ప్రజలు.. భారత జవాన్లపై తిరగబడ్డారు. 13 మంది జ‌వాన్ల‌ను బంధించి, నేపాల్ పోలీసులకు అప్పగించారు.

మ‌రోవైపు ఈ ప‌రిణామాల కంటే ముందే నేపాల్ కు చెందిన మాజీ మావోయిస్ట్ స్ప్లింటర్ పార్టీ భారతీయ చానెళ్ల ప్రసారాలకు వ్యతిరేకిస్తూ ప్రచారాన్ని లేవనెత్తింది. మ‌న దేశానికి స‌రుకులు ఇవ్వ‌ని భార‌త్ ప్రసారాల అవ‌స‌రం ఏముంద‌ని ఆ పార్టీ ప్ర‌చారం చేప‌ట్టింది. దీంతో భారత్ కు చెందిన 42 న్యూస్ ఛానెళ్ల ప్రసారాలు నిలిచిపోయాయి. అయితే ఈ విష‌యాన్ని నేరుగా చెప్ప‌కుండా....నేపాల్ జాతీయ సార్వభౌమత్వానికి సంబంధించిన విషయంలో భారత్ కలుగజేసుకున్నట్లయితే శాశ్వతంగా భారత్ చానళ్ల ప్రసారాలను నిలిపివేయాలని నిశ్చయించుకున్నట్లు ఆ దేశ కేబుల్ సంస్థ‌ల ప్ర‌తినిధులు స్ప‌ష్టం చేశారు. ఇదిలాఉండ‌గా... నేపాల్ రాజ‌ధాని ఖాట్మండుతోపాటు మ‌రికొన్ని ప్రాంతాల్లో మ‌న దేశ సినిమాల ప్ర‌ద‌ర్శ‌న‌ను కూడా నిలిపివేసిన‌ట్లు స‌మాచారం.

పెద్ద ఎత్తున గంద‌ర‌గోళ ప‌రిస్థితులు నెల‌కొన్న నేప‌థ్యంలో ఇరుదేశాల రాయ‌బారులు స‌మావేశ‌మై స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశారు. నిత్యావ‌స‌ర స‌రుకుల‌ను అంద‌జేసేందుకు త‌మ‌కు ఇబ్బందేమీ లేద‌ని భార‌త రాయ‌బారి హామీ ఇచ్చారు. అయితే నేపాల్‌లోని ప‌రిస్థితులు కుదుట‌ప‌డేలా చూడాల‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.