Begin typing your search above and press return to search.

సిద్ధూ కొత్త ప్లాన్స్... టార్గెట్ బీజేపీ!

By:  Tupaki Desk   |   29 Sep 2016 4:43 AM GMT
సిద్ధూ కొత్త ప్లాన్స్... టార్గెట్ బీజేపీ!
X
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ బీజెపీ నుంచి బయటకు వచ్చి "ఆవాజ్ ఏ పంజాబ్" (ఏఏపీ) పేరుతో కొత్త పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పార్టీని ఒక రాజకీయ కూటమిగా మార్చే ప్రయత్నాల్లో ఉన్న సిద్ధూ.. ఆమేరకు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ - అకాలీదళ్ కూటమిని చిత్తుచేయడమే లక్ష్యంగా ముద్దుకెళ్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సిద్ధూ, ఆదిశగా కొత్త కొత్త వ్యూహాలు అనుసరిస్తున్నారు.

ఈ క్రమంలో ఏకకాలంలో కాంగ్రెస్ - ఆమ్ ఆద్మీ పార్టీల చుట్టూ చక్కర్లు కొడుతున్న సిద్ధూ... ఆమేరకు రెండు పార్టీలతో ఇప్పటికే ఒక అండర్ స్టాండింగ్ కి వచ్చేసినట్లు కథనాలు వస్తున్నాయి. గతవారమే ఢిల్లీలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సన్నిహితుడు - పంజాబ్ - ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రచార వ్యూహకర్త ప్రశాత్ కిశోర్ ను కలుసుకున్న సిద్ధూ పలు అంశాలపై చర్చలు జరిపారు. ఇదే క్రమంలో సిద్ధూ సహచరుడు ఒకరు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కీలక నేతలతో మరోవైపు మంతనాలు జరుపుతున్నారు. ఇలా ఆయా పార్టీల వ్యూహకర్తలతో వరుస భేటీలు జరుపుతున్న సిద్ధూ అండ్ కో కొత్త సమీకరణాలు తీసుకొచ్చే పనిలో ఉన్నారు.

కాగా... బీజేపీని వీడిన తర్వాత ఏ పార్టీలో చేరాలనే దానిపై ఏర్పడిన సందిగ్ధావస్థలో సిద్ధూ వ్యవహార శైలితో గతంలో ఆప్ - కాంగ్రెస్ లు ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఏఏపీ కూటమి కింద ఆప్ - కాంగ్రెస్ లు కలిసి పోటీ చేయడమా.. లేక ఎన్నికల ఫలితాలను బట్టి మద్దతు ఇచ్చుకోవడమా.. అనే విషయాలపైనే ప్రస్తుతం ఈ చర్చలు జరుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఈ మూడు పార్టీల టార్గెట్ మాత్రం బీజేపీ - అకాలిదళ్ కూటమే!!