నేను పోటీచేస్తే లోకేష్ ఖతం !

Thu Mar 14 2019 17:47:41 GMT+0530 (IST)

లోకేష్... రచ్చ గెలవడం ఏమో గానీ ఇంటనే గెలవలేదు. స్వయంగా ఆయన దగ్గర బంధువు అయిన నార్నే శ్రీనివాసరావు లోకేష్ పై పోటీకి సై అంటున్నారు. ఒకవేళ మా పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్) అధినేత జగన్ ఆదేశిస్తే లోకేష్ పై పోటీ చేసి లోకేష్ ని ఓడిస్తాను అని శపథం చేశారు. చంద్రబాబు బంధువులే ఒక్కొక్కరూ జగన్ పంచన చేరడం చంద్రబాబు వ్యక్తిత్వంపై జనానికి అనేక అనుమానాలు కలిగిస్తోంది.ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి వైసీపీలో ఉన్నారు. తాజాగా మునుపటి ఎన్నికల్లో తెలుగుదేశానికి స్వయంగా ప్రచారం చేసిన ఎన్టీఆర్ సొంత మామ ఇపుడు జగన్ తో చేరారు. చంద్రబాబును దగ్గర నుంచి చూసిన వారే ఆయనను వీడి జగన్ తో చేరడం అంటే కచ్చితంగా జగన్ పై నమ్మకానికి ఇదొక సూచిక.

చంద్రబాబు నేనే హైదరాబాదును అభివృద్ధి చేశాను అని చెప్పకుంటారు. అనేక మంది సీఎంలు చేసిన అభివృద్ధిని చంద్రబాబు  తన అక్కౌంట్లో వేసుకుంటారు. వాస్తవానికి వైఎస్ చేసిన అభివృద్ధి తీసుకున్న నిర్ణయాలతో పోలిస్తే చంద్రబాబు చేసింది పెద్ద విషయమే కాదు అంటూ నార్నే వ్యాఖ్యానించారు.

నేను వైసీపీలో చేరితో చాలా మంది నా అల్లుడిని అనుమానిస్తున్నారు. ఆయన కుటుంబం వేరు. నా కుటుంబం వేరు. నా నిర్ణయంపై ఎన్టీఆర్ ప్రభావం ఎలా ఉంటుంది? తారక్ కి దీనికి ఏం సంబంధం లేదు. ఇది నా సొంత నిర్ణయం. జగన్ పద్ధతి నచ్చింది అందుకే వైసీపీలో చేరాను. చంద్రబాబుతో పోలిస్తే జగన్ చాలా చాలా బెటర్ అని నార్నేశ్రీనివాసరావు చెప్పారు.