Begin typing your search above and press return to search.

చంద్రబాబు రూట్లో మోడీ

By:  Tupaki Desk   |   21 Oct 2016 8:08 AM GMT
చంద్రబాబు రూట్లో మోడీ
X
సింగపూర్ కంపెనీలకు ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాన్ని అప్పగించేలా తీసుకొచ్చిన స్విస్ ఛాలెంజి విధానం ఏపీలో ఎంతగావివాదాస్పదమైందో... ఎన్ని అనుమానాలకు తావిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశంలో ఈ విధానాన్ని ఏపీ - గుజరాత్ - పంజాబ్ తప్ప ఎవరూ తలకు ఎత్తుకోవడం లేదు. ఇప్పుడు దీన్ని ఏకంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కూడా ఫాలో అవడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. మోడీ కూడా బాబు రూట్లోనే నడుస్తున్నట్లుగా కనిపిస్తోంది.

మౌలిక సదుపాయాల కోసం చేపట్టే ప్రాజెక్టులు, ఆస్పత్రులు, విద్యా సంస్థలతో పాటు జాతీయ కార్యక్రమాలను నిర్వహించేందుకు రాష్ట్రాల మధ్య ‘స్విస్‌ ఛాలెంజ్‌’తో పోటీ పెట్టడానికి కేంద్రం రెడీ అవుతోంది. ఐఐటీ, ఐఐఎంలు, ఎయిమ్స్‌ వంటి ప్రతిష్టాత్మక జాతీయ సంస్థలకు స్థలాలను ఎంపిక చేయడం కోసం ఎన్డీయే ప్రభుత్వం రానున్న రోజుల్లో స్విస్‌ ఛాలెంజ్‌ విధానాన్ని అవలంబించనుంది. వీటితో పాటు పోర్టులు, రిఫైనరీలు, ఎన్‌ఎన్‌జీ టెర్మినళ్లు, ఫుడ్‌ ప్రోసెసింగ్‌ యూనిట్లతో పాటు చలన చిత్రోత్సవాలు, జాతీయ క్రీడలు, ప్రవాసీ భారతీయ దివస్‌ వంటి కార్యక్రమాలు కూడా స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతిన కేటాయించాలని కేంద్రం యోచిస్తోంది. ఇందుకోసం రాష్ట్రాలు తగినంత భూమి కేటాయించేందుకు ముందుకు రావడంతో పాటు, ఆర్ధిక రాయితీలు ఇవ్వడం, వేగంగా అనుమతులు జారీచేయడం, ఉద్యోగ కల్పన తదితర ఏర్పాట్లు తదితర ప్రమాణాల్లో ఎవరు ఎక్కువ ముందుంటే వారికి ఈ ప్రాజెక్టుల్లో ప్రాధాన్యత ఉంటుంది. ఏ రాష్ట్రానికి ఎక్కువ స్కోరు ఉంటుందో సదరు రాష్ట్రం ఈ ప్రాజెక్టులు, సంస్థలు లేదా కార్యక్రమాలను అందుకోగలుగుతుంది. ”స్విస్‌ ఛాలెంజ్‌ తీసుకురావడం వెనుక ప్రధానంగా పారదర్శకత, నిష్పాక్షికత, ప్రతిభ ఆధారి తంగా నిర్ణయాలను ప్రోత్సహించడమే ప్రభుత్వం లక్ష్యమని చెబుతున్నా ఏపీ అనుభవాల నేపథ్యంలో ఇది ఎంతవరకు నిజమన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వివిధ రంగాల్లో ఆయా ప్రాంతాలను ఎంపిక చేసి రాష్ట్రాల మధ్య పోటీతత్వం పెంచేందుకు ఇది ఉపయోగపడుతుందని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఈ నెలాఖరుకల్లా ఆయా శాఖల ద్వారా నిర్వహించే కార్యక్రమాలు, ఏర్పాటు చేసే సంస్థలు, ప్రాజెక్టుల జాబితాలను కేబినెట్‌ సెక్రటేరియట్‌కు సమర్పించాలని కేంద్రం అన్ని మంత్రిత్వ శాఖలకు ఆదేశించినట్టు సమాచారం.

స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతిలో ఒక వేళ మూడో పార్టీ ప్రతిపాదన నచ్చకపోతే… మొదటి బిడ్డర్‌కు మళ్లి వేలంలో పాల్గొనేందుకు అవకాశం ఇస్తారు. ఒక వేళ మొదటి బిడ్డర్‌ ఈ సారి మంచి ప్రతిపాదనతో ముందుకు వస్తే ఆ ప్రాజెక్టును సదరు కంపెనీకే అప్పగించేందుకు అనుమతిస్తారు. అలా కానిపక్షంలో ఏ కంపెనీ మరింత ఆకర్షణీయమైన ప్రతిపాదనతో ముందుకు వస్తుందో వారికే ప్రాజెక్టు దక్కుతుంది. ఇప్పటికే రైల్వే స్టేషన్ల పునర్నిర్మాణ పనుల్లో ఈ విధానామే అనుసరిస్తున్న కేంద్రం ఇకపై మొత్తంగా ఇదే ఫాలో కానున్నట్లు తెలుస్తోంది.