Begin typing your search above and press return to search.

క‌ర్ణాట‌క కోసం మోడీనే తీసుకొస్తున్నారా?

By:  Tupaki Desk   |   23 March 2019 4:51 AM GMT
క‌ర్ణాట‌క కోసం మోడీనే తీసుకొస్తున్నారా?
X
2014లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్.. గుజ‌రాత్ ల నుంచి బ‌రిలోకి దిగిన మోడీ తాను అనుకున్న‌ది సాధించారు. గుజ‌రాత్ తో క్లీన్ స్వీప్ చేయ‌ట‌మే కాదు.. యూపీలో క్లీన్ స్వీప్ అన్న‌ట్లుగా ప‌లితాలు వెల్ల‌డ‌య్యాయి. ఇదిలా ఉంటే.. తాజాగా జరుగుతున్న ఎన్నిక‌ల్లో ఆయ‌న యూపీలోని కాశీ ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నారు. దీనికి తోడుగా మ‌రో స్థానం నుంచి ఆయ‌న బ‌రిలోకి దిగుతార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది.

తాజాగా ఆయ‌న క‌ర్ణాట‌క‌లోని బెంగ‌ళూరు బ‌రిలో నుంచి పోటీకి దిగ‌నున్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. భార‌తావ‌నిలో తాము టార్గెట్ చేసిన ప్ర‌తి ప్రాంతంలో కాషాయ‌జెండాను ఎగుర‌వేసిన మోడీ బ్యాచ్ కు ఏ మాత్రం కొరుకుడుప‌డ‌ని ప్రాంతంగా ద‌క్షిణాది నిలిచింది. ద‌క్షిణాదిలోని ఐదు రాష్ట్రాల్లో బీజేపీ బ‌లం నామ‌మాత్ర‌మే. మిగిలిన నాలుగు రాష్ట్రాల‌తో పోలిస్తే.. క‌ర్ణాట‌క‌లో ఆ పార్టీ మెరుగైన ప‌రిస్థితినెల‌కొంది. ఈ మ‌ధ్య‌న జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీకి ప‌వ‌ర్ ప‌క్కా అన్న ప్ర‌చారం జ‌రిగినా.. చేతికి వ‌చ్చిన‌ట్లే వ‌చ్చి చేజారిపోయింది.

అప్ప‌టి నుంచి క‌ర్ణాట‌క పీఠాన్ని సొంతం చేసుకోవాల‌ని త‌పిస్తున్న బీజేపీ తాజాగా మోడీనే బ‌రిలోకి దింపాల‌ని డిసైడ్ అయ్యింది. ఇందుకు త‌గ్గ‌ట్లే.. దివంగ‌త కేంద్ర మంత్రి అనంత‌కుమార్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఎంపీ స్థానంలో తొలుత ఆయ‌న స‌తీమ‌ణి తేజ‌స్వినిని అభ్య‌ర్థిగా బ‌రిలోకి దింపాల‌ని భావించారు. కానీ.. ఆమెకు బ‌దులుగా మోడీని దించితే మంచిద‌న్న భావ‌న‌లో ఉన్న‌ట్ఉల చెబుతున్నారు.

క‌ర్ణాట‌క‌లోని 28 ఎంపీ స్థానాలకు గాను బీజేపీ ఇప్ప‌టికి 21 స్థానాల‌కు అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించింది. ఈ జాబితాలో బెంగ‌ళూరు సౌత్ పేరు లేక‌పోవ‌టం ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. దివంగ‌త కేంద్ర మంత్రి స‌తీమ‌ణికి తొలి జాబితాలోనే పేరు ఉంటుంద‌ని భావించిన దానికి భిన్నంగా పేరు లేక‌పోవ‌టం ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారి తీసింది. తాజాగా బ‌య‌ట‌కు వ‌స్తున్న స‌మాచారం ప్ర‌కారం బెంగ‌ళూరు సౌత్ స్థానం నుంచి మోడీ బ‌రిలోకి దిగాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

ద‌క్షిణాదిపై క‌న్నేసిన క‌మ‌ల‌నాథులు.. మోడీని క‌ర్ణాట‌క బ‌రిలో దింప‌టం ద్వారా ఆ ప్ర‌భావం మిగిలిన నాలుగు రాష్ట్రాల మీద ప‌డుతుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ద‌క్షిణాదిన మోడీ విజ‌యం సాధించ‌టం ద్వారా.. ఆయ‌న‌కు ద‌క్షిణాది ప్ర‌జ‌ల ఆమోదం ఉంద‌న్న అభిప్రాయం క‌లిగేలా చేయ‌టం కూడా ఒక వ్యూహంగా చెబుతున్నారు.

మోడీ మాష్టారు బెంగ‌ళూరు సౌత్ నుంచి పోటీ చేసిన ప‌క్షంలో.. క‌ర్ణాట‌క‌లో మెజార్టీ ఎంపీ స్థానాల్ని చేజిక్కించుకునే వీలు ఉంటుంద‌ని.. మోడీ మేనియా క‌ర్ణాట‌క మొత్తానికి పాకుతుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల బెంగ‌ళూరు సౌత్ నుంచి పోటీ చేయాల‌న్న మాట‌కు మోడీ నెగిటివ్ గా రియాక్ట్ కావ‌టం.. బెంగ‌ళూరు సౌత్ లో తేజ‌స్విని తానే అభ్య‌ర్థిగా ప్ర‌చారం చేసుకోవ‌టం లాంటి అంశాలు చూస్తే ప్ర‌ధాని బ‌రిలోకి దిగుతారా? లేదా? అన్న సందేహం క‌లుగ‌క మాన‌దు. అదే స‌మ‌యంలో.. తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో మోడీ బెంగ‌ళూరు సౌత్ బ‌రిలో దిగ‌టం ఖాయ‌మ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.