మోడీ ప్రసంగం..అమితాబ్ సినిమా ఒకటే

Wed Jan 11 2017 22:24:53 GMT+0530 (IST)

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సెటైర్లు గుప్పించారు. న్యూఢిల్లీలోని జన్ వేదనా సమ్మేళన్ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన రాహుల్ సినిమాల్లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ డైలాగ్ ఎలా ఉంటుందో ప్రధాని నరేంద్ర మోడీ స్పీచ్ అలా ఉందని ఎద్దేవా చేశారు. మాటలతో చెప్పడమే కాకుండా మోడీని అనుకరించే ప్రయత్నం చేశారు. మిత్రో అంటూ మోడీ ఎలా ప్రసంగిస్తారో.. రాహుల్ కూడా అచ్చూ అలాగే మాట్లాడి అతిథులను అలరించారు.

కాగా... నోట్ల రద్దు ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగత నిర్ణయమని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ఇవాళ జనసమ్మేళన్ సదస్సులో పాల్గొని ప్రసంగించారు. పీఎం మోడీ పేదలకు సమయం ఇవ్వడంలేదని దుయ్యబట్టారు. బీజేపీ - ఆర్ ఎస్ ఎస్ లే దేశాన్ని నడిపిస్తున్నాయని రాహుల్ గాంధీ మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడే మంచి రోజులున్నాయని దేశం కోసం కాంగ్రెస్ ఎన్నో త్యాగాలు చేసిందని పేర్కొన్నారు. ఆర్ బీఐ గవర్నర్ పదవిని ప్రధాని మోడీ ఎగతాళి చేశారని విమర్శించారు. తమ కాంగ్రెస్ పాలనలో ఆర్ బీఐని - జుడిషీయరీని గౌరవించామని రాహుల్ గాంధీ వివరించారు.  ప్రధాని మోడీ విధానాల వల్ల 60 శాతం ఆటో మొబైల్ అమ్మకాలు తగ్గాయని స్పష్టం చేశారు. మీడియా మిత్రులు ఎన్నో అవరోధాల నెదుర్కొంటున్నారని తెలిపారు. తన వద్దకు వచ్చినపుడు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నారని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. 2019లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ప్రజలక మళ్లీ మంచి రోజులొస్తాయని రాహుల్ గాంధీ జోష్యం చెప్పారు. కాగా ఈ సదస్సుకు అనారోగ్యం కారణంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ హాజరు కాలేక పోయారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/