Begin typing your search above and press return to search.

‘ట్రిపుల్ తలాక్’ పై మోడీ అటాక్ షురూ

By:  Tupaki Desk   |   25 Oct 2016 4:57 AM GMT
‘ట్రిపుల్ తలాక్’ పై మోడీ అటాక్ షురూ
X
ట్రిపుల్ తలాక్ ఇష్యూపై ప్రధానమంత్రి మోడీ అటాక్ మొదలైంది. వివాదాస్పద ట్రిపుల్ తలాక్ అంశాన్ని మార్చటం ద్వారా.. విప్లవాత్మక నిర్ణయాలకు నాంది పలకాలని భావిస్తున్న మోడీ సర్కారుకు.. గడిచిన కొద్ది రోజులుగా ముస్లిం వర్గాల నుంచి తీవ్రవ్యతిరేకత వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఓపక్క ముస్లిం మహిళలు కొందరు ట్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని.. ఇప్పుడు అమలు చేస్తున్న విధానాల్ని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు.. ట్రిపుల్ తలాక్ ను నిషేధిస్తే.. అది తమ ఆస్తిత్వాన్నే దెబ్బ తీసే చర్యగా ముస్లిం పెద్దలు.. మజ్లిస్ లాంటి పార్టీ భయాందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. ట్రిపుల్ తలాక్ అంశంపై ఇప్పటివకే తమ విస్పష్ట అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన నేపథ్యంలో.. ఈ అంశం వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో ట్రిపుల్ తలాక్ మీద ప్రధాని మోడీ తొలిసారి పెదవి విప్పారు. ఉత్తరప్రదేశ్ లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. ట్రిపుల్ తలాక్ విధానాన్ని ఎందుకు నిషేధించాలన్న విషయాన్ని వివరించే ప్రయత్నం చేశారు.

ట్రిపుల్ తలాక్ ను నిషేధించే అంశం హిందూ.. ముస్లింలకు సంబంధించిన అంశం ఎంతమాత్రంకాదని.. ముస్లిం మహిళల హక్కుల్ని కాపాడటంగా చెప్పిన ప్రధాని మోడీ.. ఈ అంశాన్ని ప్రభుత్వం.. ప్రతిపక్షాల మధ్య వివాదంగా మీడియా మార్చొద్దన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముస్లింలలో ఖురాన్ తెలిసిన మేధావుల మధ్య చర్చ జరగాలని.. తమ అభిప్రాయాల్ని వ్యక్తీకరించే విద్యావంతులైన మహిళలు ముందుకు రావాలని.. అసలు సమస్య ఏమిటో దేశంలోని 125 కోట్ల మందికి తెలియకూడదని అనుకుంటున్న వారికి.. ముస్లిం సమాజంలో మార్పు కోరకునే వారికి మద్య చర్చ జరగాలని తాను భావిస్తున్నట్గా చెప్పారు. ‘‘ఎవరైనా హిందువు ఆడ శిశివుల భ్రూణ హత్యలకు పాల్పడితే జైలుకు వెళ్తాడు.. మరి నా ముస్లిం సోదరీమణులు ఏం పాపం చేశారు? కొందరు ఫోన్లలోనే వారికి తలాక్ చెప్పేసి వారి జీవితాల్ని నాశనం చేస్తున్నారు’’ అంటూ తలాక్ ఇష్యూపై తన వాదన ఏమిటి? తానేం అనుకుంటున్న విషయాన్ని మోడీ స్పష్టంగా చెప్పేశారని చెప్పొచ్చు. తాజా బహిరంగ సభతో తలాక్ పై తన విధానాన్ని వెల్లడించటంతో పాటు.. రానున్న రోజుల్లో ఈ అంశంపై తన టోన్ ఎంతలా పెరగనుందన్న విషయాన్ని మోడీ తాజాగా స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/