Begin typing your search above and press return to search.

26 మంది ట్రంప్ బ్యాచ్ మోడీని కలిసింది

By:  Tupaki Desk   |   22 Feb 2017 4:54 AM GMT
26 మంది ట్రంప్ బ్యాచ్ మోడీని కలిసింది
X
ఓపక్క హెచ్ 1బీ వీసాల విషయంలో అమెరికా అధ్యక్షుడి ట్రంప్ సర్కారు తీరుతో భారతీయులకు ఇబ్బందులు పొంచి ఉన్నాయన్న వాదన నడుమ కీలక సమావేశం జరిగింది. 34మంది సభ్యులతో కూడిన ట్రంప్ బ్యాచ్ ప్రదాని మోడీతో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా ట్రంప్ పాలనా యంత్రాంగం చేపడుతున్న చర్యలపైనా ఇరు వర్గాలు చర్చలు జరిపారు. ఇరు దేశాలు కలిసి పని చేసే రంగాలపైన చర్చ సాగినట్లుగా చెబుతున్నారు.

ఢిల్లీకి వచ్చిన ట్రంప్ బ్యాచ్ తో మోడీ సమావేశం అయ్యారు. కొత్త అధ్యక్షుడు ట్రంప్ తో తన ఫోన్ సంభాషణ సానుకూలంగా జరిగిన విషయాన్ని గుర్తు చేసుకున్న మోడీ.. భారతీయుల నైపుణ్యాల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు జరిగిందన్నారు. గడిచిన రెండున్నరేళ్లలో ఇరు దేశాల మధ్య బలపడిన బంధాన్ని గుర్తు చేసిన మోడీ.. రానున్న రోజుల్లో తమ మధ్య నెలకొన్న బంధం మరింత పటిష్టమవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసినట్లుగా వెల్లడించారు.

ట్రంప్ బ్యాచ్ తో మోడీ భేటీ చూసినప్పుడు.. అమెరికాలో కొత్తగా కొలువు తీరిన ప్రభుత్వ విధానాల్ని.. భారత ప్రధానికి వివరించటం.. అదే సమయంలో తమ విధానాలపై మోడీ సర్కారు ఎలా స్పందిస్తుందన్న విషయాన్ని అంచనా వేయటంతో పాటు.. ద్వైపాక్షిక సంబందాలు.. వ్యాపార సంబంధాల అంశాలపై చర్చలు జరిపేందుకు వీలుగా తాజా సమావేవం సాగినట్లుగా తెలుస్తోంది. హెచ్ 1బీ వీసాల జారీ విషయంలో అమెరికా నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్న సందేశాన్ని మోడీ ఇవ్వటం ద్వారా.. ట్రంప్ పాలనా విధానాల పట్ల తమకున్న సందేహాల్ని.. సంశయాల్ని చెప్పకనే చెప్పేశారని చెప్పాలి. మరి.. ట్రంప్ బ్యాచ్ మోడీని కలిసిన వేళ.. ఆయన చెప్పిన మాటలకు అమెరికా అధ్యక్షుడి స్పందన ఎలా ఉంటుందన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/