Begin typing your search above and press return to search.

మోదీ మ‌రోసారి ఎంత భ‌య‌పెట్టారంటే!

By:  Tupaki Desk   |   26 Sep 2017 10:15 AM GMT
మోదీ మ‌రోసారి ఎంత భ‌య‌పెట్టారంటే!
X
ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ దేశ ప్ర‌జ‌ల‌కు ఒక్క‌సారిగా చెమ‌లు ప‌ట్టించారు. న‌రాలు తెగే ఉత్కంఠ‌కు గురి చేశారు. ఇక ఇప్పుడు ఈ దేశంలో ఎలాంటి మార్పు చూడ‌బోతామో? అనేలా పెద్ద ఎత్తున చ‌ర్చ‌ల‌కు తెర‌లేపారు. అయితే, ఆ ప‌దినిమిషాలు గ‌డిచాక‌.. మోదీ చేసిన ప్ర‌క‌ట‌న‌తో అంతా కూల్ కూల్‌.. హుషార్ .. హుషార్‌.. అన్న‌ట్టుగా ఊపిరి పీల్చుకున్నారు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగింది? ప్ర‌ధాని మోదీ ఎందుకంత‌గా భ‌య‌పెట్టారు? చూద్దాం ప‌దండి.. విష‌యం ఏంటో తెలుసుకుందాం పదండి!

సోమ‌వారం(నిన్న‌) ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ దేశ ప్ర‌జ‌ల‌కు ఓ వినూత్న ప‌థ‌కాన్ని ప్ర‌క‌టిస్తార‌ని పీఎంవో మీడియాకు వార్త‌లు అందించింది. అయితే, దీనిపై ఇంకెలాంటి ప్ర‌క‌ట‌నా బ‌య‌ట‌కు రాలేదు. దీంతో దేశ వ్యాప్తంగా ఒక్క‌టే చ‌ర్చ‌! దీనికి ఓ కార‌ణం ఉంది. ఖ‌చ్చితంగా గ‌త ఏడాది న‌వంబ‌ర్‌ లోనూ ఉరుములు లేని పిడుగులా ప్ర‌ధాని నోట్ల ర‌ద్దు ప్ర‌క‌టించారు. దీంతో దేశం మొత్తం తీవ్రంగా షేక్ అయింది. ఇక‌, ఇప్పుడు కూడా అలాంటి నిర్ణ‌యం ఏద‌న్నా తీసుకుంటున్నారేమోన‌ని అంద‌రూ అనుకున్నారు. దీనిపైనే చ‌ర్చ‌లు కూడా సాగాయి.

ఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో సోమ‌వారం జ‌రిగిన బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ‌కు 3 వేలమంది బీజేపీ ఎంపీలు - ఎమ్మెల్యేలు - ప్రజాప్రతినిధులు - కార్య‌క‌ర్త‌లు భారీ సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు. ఈ సమావేశంలో మోదీ ఒక సెన్సేషనల్ నిర్ణయం ప్రకటిస్తారంటూ అప్పటికే మీడియాకు ప్ర‌చారం చేసింది. ఇక‌, ఈ కార్య‌క్ర‌మానికి ముందు ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ సైతం ప్రధాని ఒక ప్రకటన చేయబోతున్నారంటూ ప్ర‌క‌టించారు. దీంతో అంద‌రూ ఒక్క‌సారిగా గ‌త ఏడాది న‌వంబ‌ర్ సీన్ త‌లుచుకున్నారు. ఏం ప్ర‌క‌టిస్తారో అనుకుంటూ.. ఒక‌రి మొఖాలు ఒక‌రు చూసుకున్నారు.

ఇంత‌లో ప్ర‌ధాని స‌భావేదిక‌ను అలంక‌రించి మైకు పుచ్చుకున్నారు. అంతా సైలెంట్‌!! అంద‌రి చెవులూ.. ప్ర‌ధాని మోదీ పెద‌వుల నుంచి వ‌చ్చే మాట‌ల‌పైనే రెక్కించాయి. దేశ ప్ర‌జ‌ల‌కు ఈ ప్ర‌భుత్వం సౌభాగ్య ప‌థ‌కం చేరువ చేస్తోంది అని మోదీ ప్ర‌క‌టించ‌గానే అంద‌రూ ఒక్క‌సారిగా టెన్ష‌న్ నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. 2018 నాటికి దేశంలోని అన్ని ఇళ్ల‌లోనూ విద్యుత్ వెలుగు ప్ర‌స‌రించాల‌నే ప్ర‌ధాన ఉద్దేశంతో ఈ ప‌థ‌కం ప్ర‌వేశ పెడుతున్న‌ట్టు మోదీ చెప్పారు. రూ.500 ల‌కే విద్యుత్ క‌నెక్ష‌న్ ఇచ్చే ఈ ప‌థ‌కాన్ని దేశంలో అమ‌లు చేస్తామ‌ని చెప్పారు. మొత్తంగా ఈ ప‌థ‌కం మాట అటుంచి.. అప్ప‌టి వ‌ర‌కు మోదీ ఎలాంటి ప్ర‌క‌ట‌న చేస్తారోన‌ని జ‌నాలు మాత్రం హ‌డ‌లి పోయారు. త‌ర్వాత హ‌మ్మ‌య్య అనుకున్నారు.