Begin typing your search above and press return to search.

ఏపీకి పచ్చడి మెతుకులు ఆఫ్రికాకు బిర్యానీయా?

By:  Tupaki Desk   |   29 Oct 2015 1:32 PM IST
ఏపీకి పచ్చడి మెతుకులు ఆఫ్రికాకు బిర్యానీయా?
X
పేరొస్తుందంటే ప్రధాని మోడీ ఏమైనా చేసేలా ఉన్నారు.. పబ్లిసిటీ - పాపులారిటీ కోసం ఆయన ఇప్పుడు దేశంలోని రాష్ట్రాల కడుపు కొడుతున్నారు. ఏపీ వంటి రాష్ట్రాలు ఆకలో అంటుంటే ఏమాత్రం వినిపించుకోకుండా పొరుగు దేశాలకు బిర్యానీ పెడుతున్నారు.

ఇండో ఆఫ్రికన్ సదస్సుకు వెళ్లిన ఆయన అక్కడ ఆప్రికా దేశాలకు ఏకంగా 60 మిలియన్ డాలర్ల సహాయం ప్రకటించారు. అంటే దాదాపు 400 కోట్ల రూపాయలన్నమాట. ఆఫ్రికా దేశాల అభివృద్ధికి అన్నివిధాలుగా తోడ్పాటునందిస్తామని హామీ ఇచ్చిన మోడీ మరో ఐదేళ్లలో 10 బిలియన్‌ డాలర్ల రాయితీ రుణాన్ని అందిస్తామన్నారు. డిజిటల్‌ సాంకేతిక అభివృద్ధికి అంతరిక్ష పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన అన్నారు. ఆఫ్రికా వ్యవసాయ రంగం ప్రపంచ ఆహార భద్రతకు మద్దతుగా నిలుస్తుందని ప్రధాని చెప్పారు

ఆప్రికాకు ఇవ్వడంలో తప్పేమీ లేకపోయినా అదేసమయంలో ఇండియాలో కష్టాల్లో ఉన్న రాష్ట్రాలను పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే... మోడీ ఏపీ వంటి రాష్ట్రాలపై చిన్నచూపు చూస్తూ ఒక్క పైసా కూడా విదిలించడం లేదు. గతంలోనూ పలు ఇతర దేశాలకు భారీగా సహాయం ప్రకటించిన మోడీ తీరుపై తెలుగుప్రజలు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.