Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ తో భేటీ మోడీని అంత‌లా మెప్పించిందే!

By:  Tupaki Desk   |   26 May 2019 12:06 PM GMT
జ‌గ‌న్ తో భేటీ మోడీని అంత‌లా మెప్పించిందే!
X
ఒక ట్వీట్ చాలా విష‌యాల్ని చెప్పేస్తుంది. ప్ర‌ధానిగా రెండోసారి ప్ర‌మాణ‌స్వీకారం చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న మోడీకి.. ఏపీకి ముఖ్య‌మంత్రి కానున్న జ‌గ‌న్ భేటీ కావ‌టం తెలిసిందే. ఢిల్లీలో మోడీని క‌లిసిన జ‌గ‌న్.. ఆ త‌ర్వాత నిర్వ‌హించిన మీడియా భేటీలో తమ మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ‌ను తెలిపే ప్ర‌య‌త్నం చేశారు.

ఇదొక ఆస‌క్తిక‌ర అంశమైతే.. మ‌రోవైపు జ‌గ‌న్ తో భేటీ అనంత‌రం మోడీ చేసిన ట్వీట్ ఇప్పుడు వైర‌ల్ గా మారింది. జ‌గ‌న్ భేటీపై తెలుగులో ట్వీట్ చేసిన ఆయ‌న‌.. భేటీని అద్భుతంగా అభివ‌ర్ణించ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఏపీ అభివృద్ధి మీద ఫ‌ల‌వంత‌మైన చ‌ర్చ జ‌రిపిన‌ట్లుగా పేర్కొన్నారు.

సాధార‌ణంగా మోడీ స్థాయి వ్య‌క్తుల్ని క‌లిసిన‌ప్పుడు.. ఆయ‌న‌తో భేటీ అయిన వారు త‌మ మీటింగ్ జ‌రిగిన తీరు గురించి ప్ర‌స్తావిస్తూ ట్వీట్లు చేస్తుంటారు. దీనికి భిన్నంగా మోడీనే ట్వీట్ చేయ‌టం ఒక ఎత్తు అయితే.. దాన్ని తెలుగులో చేయ‌టం మ‌రో ఎత్తు. దీనంత‌టికి కొస‌మెరుపుగా ఆయ‌న చేసిన ట్వీట్ గా చెప్పాలి. మోడీ చేసిన ట్వీట్ ను య‌థాత‌ధంగా చూస్తే..

"ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయిన @ysjagan తో అద్భుతమైన సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఫలవంతమైన చర్చ జరిపాము. ఆయన పదవీకాలంలో కేంద్రం నుండి సాధ్యమైనంత సహకారం అందిస్తామని హామీ ఇచ్చాను" అని మోడీనే స్వ‌యంగా చెప్పుకోవ‌టం చాలా అరుదైన అంశంగా చెప్పాలి. ఢిల్లీలో జ‌గ‌న్ కు ద‌క్కుతున్న ప్ర‌యారిటీకి ఇదో నిద‌ర్శ‌నంగా చెప్ప‌క త‌ప్ప‌దు.