పుతిన్ వారసుడు.. మన మోడీనేనా.?

Sun Aug 25 2019 11:52:25 GMT+0530 (IST)

కమ్యూనిస్టు దేశాలు చైనా - రష్యా.. అక్కడ రెండు సార్లు అధ్యక్షుడయ్యాక మళ్లీ కావడానికి ఉండదు. కానీ ఇప్పుడు కమ్యూనిస్టులు కూడా అధికార దాహంతో మారిపోతున్నారు. ఇప్పటికే రష్యా అధ్యక్షుడిగా రెండు సార్లు ఎన్నికైన వ్లాదిమర్ పుతిన్ మొత్తం చట్టాలను మార్చేసి రెండు సార్లు నిబంధనను సవరించేసి ఇప్పుడు ప్రధానిగా - అధ్యక్షుడిగా అటూ ఇటూ తిరుగుతూ రష్యాను గుప్పిట పట్టి రాజ్యాధికారం చేస్తున్నారు. ప్రజలు కూడా పుతిన్ ప్రజాసేవ నచ్చి ఈయన చేష్టలను స్వాగతించి అధికారం కట్టబెడుతున్నారు.ఇక మొన్నటికి మొన్న చైనాలోనూ ఇదే కథ. కమ్యూనిస్టు దేశం కూడా నిబంధనలు మార్చేసి రష్యా తరహాలో రెండు సార్లు అధ్యక్ష పదవి నిబంధనను తొలగించింది. జిన్ పింగ్ ఇప్పుడు మరోసారి చైనా అధ్యక్షుడయ్యాడు. భవిష్యత్ లోనూ అయ్యే చాన్స్ ను కట్టబెట్టకున్నాడు.

ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ లోనూ ఇదే తరహా పాలనకు మోడీ నడుం బిగించారని తెలుస్తోంది. పార్లమెంటరీ వ్యవస్థకు నీళ్లొదలిసే కొత్తగా అధ్యక్ష తరహా పాలనకు మోడీ నడుం బిగిస్తున్నారు.

మోడీ అధ్యక్ష పాలనను భారత్ లో అమలు చేయాలనుకోవడానికి ప్రధానమైన కారణం మెజార్టీ ఎంపీలు గెలవడమనే పెద్ద టాస్కే. భారత్ లో ప్రధాని కావాలన్నా.. ఒక పార్టీ అధికారంలోకి రావాలన్నా 272 ఎంపీలు గెలవాలి. ప్రతీసారి ఈ ఫీట్ సాధించడం సాధ్యం కాదు.. లేదంటే ప్రాంతీయ పార్టీలకు మోకరిల్లాలి. మోడీ మంచివాడనుకుందాం... పాలనా దక్షుడనుకుందాం... కానీ ఎంపీలు కాదు కదా.. ప్రతీసారి మోడీని చూసి ఎంపీలు చెడ్డవాళ్లైనా గెలిపించరు కదా.. ఈ పాయింటే మోడీని అధ్యక్ష ఎన్నికలకు పురిగొల్పినట్టు అర్థమవుతోంది.  దేశంలోని మెజార్టీ ఎంపీలు గెలిచినా గెలవకున్నా అధ్యక్షుడికే దేశ ప్రజలంతా ఓట్లేసి గెలిపించే విధానాన్ని మోడీ ఇంప్లిమెంట్ చేయబోతున్నారట..

ఈ లెక్కన మోడీ ఆకాశమంతా ఇమేజ్ తో ఉండగా.. ఈయనకు ప్రధాన పోటీదారు అయిన రాహుల్ గాంధీ పోటీ ఇవ్వడం కష్టమేనన్న అంచనాలున్నాయి. అందుకే అధ్యక్షుడిని డైరెక్ట్ గా ఎన్నుకునే ప్రక్రియ అయితే కలకాలం మోడీని చూసి దేశ ప్రజలు ఓటేస్తారు. ఇదే ఐడియాను దేశంలో అమలు చేయాలన్నది బీజేపీ - ఆర్ ఎస్ ఎస్ ఊవాచ.. మరి ఈ ప్లాన్ ఎంత వరకు వర్కవుట్ అవుతుందనేది వేచిచూడాలి.